BigTV English

Waqf Amendment Bill: ఆ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టగానే.. భగ్గమన్న విపక్షాలు.. సభలో గందరగోళం

Waqf Amendment Bill: ఆ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టగానే.. భగ్గమన్న విపక్షాలు.. సభలో గందరగోళం

Waqf Amendment Bill: లోక్ సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా దీనిని తీసుకువచ్చారు. ఈ చట్టం ద్వారా వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయనున్నది కేంద్రం ప్రభుత్వం. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో సుమారుగా 40 సవరణలు చేస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ సవరణలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


ఈ కొత్త బిల్లు అమలులోకి వస్తే జిల్లా కలెక్టర్లు రూపొందించిన వాస్తవ అంచనా విలువల మేర వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి వస్తుంది. అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. బిల్లును తామును వ్యతిరేకిస్తున్న చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. అందుకే మేం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి చేస్తున్నారు. ఇది మతపరమైన విభజనను సృష్టిస్తది’ అంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: నేడు నీట్ హాల్ టిక్కెట్లు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..


బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ సవరణల గురించి ఆలోచిస్తోందని, ఈ నిర్ణయం సరికాదంటూ కూడా ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×