BigTV English

Nagamalli Flower : భోళాశంకరుడు మెచ్చిన నాగమల్లి పుష్పం

Nagamalli Flower : భోళాశంకరుడు మెచ్చిన నాగమల్లి పుష్పం
Nagamalli Flower

Nagamalli Flower : అత్యంత మ‌హ‌త్యం క‌లిగిన పుష్పాల‌లో శివ‌లింగ పుష్పం ఒక‌టి. ఈ పుష్పంతో శివున్ని పూజించ‌డం వ‌ల్ల విశేష ఫ‌లితం క‌లుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు. ఈ పుష్పాలు శివ లింగ వృక్షం నుండి ల‌భిస్తాయి. శివ లింగ వృక్షాలు ఎక్కువ‌గా ద‌క్షిణ భార‌త దేశంలో, ద‌క్షిణ అమెరికాలో ఎక్కువ‌గా ఉంటాయి. దీనిని నాగ లింగ వృక్షం అని కూడా అంటారు.


ఈ పుష్పాల మ‌ధ్య భాగం ప‌డ‌గ విప్పిన స‌ర్పం లాగా ఉంటుంది. ఈ వృక్షం ఆకులు వెంట్రుక‌ల లాగా ఉంటాయి. ఈ శివ లింగ పుష్పాలు కొమ్మ‌ల‌కు పూయ‌కుండా వెంట్రుక‌లాంటి భాగాల‌కు పూయడమే ఈ పూల ప్రత్యేకత. ఈ పువ్వులపైన నాగ‌ప‌డ‌గ క‌ప్పిన‌ట్టు ఉండి లోప‌ల శివ‌లింగాకృతిలో ఉంటాయి. ఈ పుష్పాల‌ను నాగ‌మ‌ల్లి, మ‌ల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి ఎంతో చ‌క్క‌ని ప‌రిమ‌ళాన్ని వెద‌జ‌ల్లుతూ ఉంటాయి.

హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం ఈ చెట్టు ప్ర‌తి భాగంలోనూ శివుడు నెల‌కొని ఉంటాడ‌ని భావిస్తారు. ఈ పుష్పాలు స‌ర్వ దేవ‌త‌ల‌కు.. ముఖ్యంగా శివుడికి ఎంతో ప్రీతిక‌ర‌మైన‌వి. ఈ పుష్పాల‌తో శివున్ని పూజించ‌డం ప్ర‌తి భ‌క్తునికి ఒక వరం. ఈ పుష్పాల‌తో శివున్ని పూజించిన వారికి జ‌న్మ రాహిత్యాన్ని పొంది అంతిమంగా కైవ‌ల్యం పొందుతార‌ని శివ పురాణం చెబుతోంది. శివ లింగ పుష్పాల‌ను ఏ దేవునికైనా స‌మ‌ర్పించేట‌ప్పుడు త‌లపై లేదా భుజ స్కంధాల‌పై మాత్ర‌మే స‌మ‌ర్పించాలి. ఈ విధంగా శివ‌లింగ పుష్పంతో పూజ‌లు చేస్తే కోరిన కోరిక‌లు తీరుతాయ‌ని.. ఆయురారోగ్య అష్టైశ్వ‌ర్యాలు క‌లుగుతాయ‌ని అంటున్నారు.


Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×