God Idols: ఇంట్లో ఏ దేవుని ఫోటోలు పెట్టకూడదో మీకు తెలుసా..? ఆ పెట్టకూడని ఫోటోలు పెట్టుకోవడం వల్ల జరిగే పరిణామాలు ఏంటో మీకు తెలుసా..? ఇంతకీ ఏఏ దేవుని ఫోటోలు పెట్టుకోకూడదో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎవరైనా ఇంట్లో దేవుని ఫోటోలు పెట్టుకుని పూజిస్తుంటారు. అయితే శాస్త్రం ప్రకారం కొంత మంది దేవుళ్ల ఫోటోలు ఇంట్లో దేవుని మందిరంలో పెట్టుకోకూడదని జ్యోతిష్య పండితుల చెప్తున్నారు. అలా పెట్టుకోవడం ఆ ఇంట్లో లేనిపోని అనర్థాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే దేవుని ఫోటోలే కదా పెట్టుకోవడం వల్ల చెడు ఎందుకు జరుగుతుందని ప్రశ్నించేవాళ్లు ఉంటారు. అయితే ఇంట్లో ఎప్పుడూ శాంతరూపులైన దేవుళ్ల ఫోటోలు పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని.. అలా కాకుండా ఉగ్రదేవతల ఫోటోలు పెట్టుకోవడం వల్ల వారి నుంచి వచ్చే శక్తిని తట్టుకోవడం మానవ మాత్రులకు సాధ్యం కాదని అందుకే కొంత మంది ఉగ్రదేవతల ఫోటోలు ఇంట్లో దేవుని మందిరంలో పెట్టుకోకూడదని హెచ్చిరస్తున్నారు పండితులు. ఆ ఉగ్రదేవతలెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగ్ర నరసింహ స్వామి: ఇంట్లో దేవుడి గదిలో ముఖ్యంగా పెట్టకూడని ఫోటో ఏదౌనా ఉందంటే అది ఉగ్ర నరసింహ స్వామి ఫోటో. ఈ ఫోటో పెట్టుకోవడం వల్ల ఇంట్లో కలహాలు పెరిగిపోతాయి. ఇంట్లో వాళ్ల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంట్లో మనఃశాంతి లేకుండా పోతుందట. అయితే లక్ష్మీ నరసింహ స్వామి, యోగ నరసింహ స్వామి, ప్రహ్లాద నరసింహ స్వామి ఫోటోలు మాత్రం పెట్టుకోవచ్చని పండితులు చెప్తున్నారు.
మహాలక్ష్మీ దేవి: అదేంటి లక్ష్మీ దేవి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదా అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మహాలక్ష్మీ దేవి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు మీరు చదువుతుంది కరెక్టే.. కానీ లక్ష్మీదేవి అమ్మవారు నిలబడి ఉన్న ఫోటో ఎప్పుడూ కూడా ఇంట్లో పెట్టుకోకూడదట. ఇలా పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ఉండే సిరిసంపదలు బయటకు లేచి వెళ్లిపోతాయని చెప్తుంటారు. అయితే కమలం పువ్వులో కూర్చుని ఉన్న లక్ష్మీ దేవి ఫోటో పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదట. ఆ ఇంట్లో ఎప్పుడూ సిరిసంపదలు వెల్లువెత్తుతాయట.
శ్రీరామ పట్టాభిషేకం ఫోటో: ఎవరి ఇంటిలోనైనా శ్రీరాముడికి పట్టాభిషేకం జరుగుతున్న ఫోటో ఉంటే ఆ ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయట. ఆ ఇంటి సభ్యుల ఆలోచనా ధోరణి మారిపోతుందట. వారికి మంచి ఆలోచనలు రావడం కన్నా మూర్ఖపు ఆలోచనలు పెరిగిపోతాయట. ఇంటి సభ్యుల మధ్య సఖ్యత లోపిస్తుందట.
నటరాజ స్వామి: ఇంట్లో పూజా మందిరంలో నటరాజ స్వామి ఫోటో ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదని పండితులు చెప్తున్నారు. ఈ నటరాజ స్వామి ఫోటో ఇంట్లో ఉంటే అనతి కాలంలోనే ఆ ఇంట్లో పేదరికం తాండవం చేస్తుందట. వారు ఎంత ధనవంతులుగా బతుకుతున్నప్పటికి ఆస్తి అంతా కరిగిపోయి కటిక దరిద్రులు అవుతారట. కానీ నాట్య కళాశాలల్లో ఈ నటరాజ స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ పెడితే ఆ కళాశాలకు విఫరీతమైన పేరు ప్రఖ్యాతులు వస్తాయట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఆ రాశుల్లో పుట్టిన పురుషులు.. భార్యలకు బానిసలుగా మారతారట