Zodiac Signs – Slaves: కొన్ని రాశుల్లో పుట్టిన వ్యక్తులు తమ జీవిత భాగస్వామికి బానిసల్లా మారి సేవలు చేస్తుంటారట. మరికొందరు అసలు భార్యలను లెక్కే చేయరట. ఏ రాశిలో పుట్టిన వ్యక్తులు తమ జీవిత భాగస్వామి పట్ల ఎలాంటి వైఖరితో ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశిలో పుట్టిన మగవారు ఎప్పటికీ భార్యలకు బానిసలుగా మారరట. కానీ ఈ రాశి జాతకులకు భార్యపై ఎనలేని ప్రేమ ఉంటుందట.
వృషభ రాశి: ఈ రాశి జాతకులు చాలా బాలెన్స్‌గా ఉంటారట. వీరు భార్యకు సేవలు చేసుకుంటూనే ప్రేమగా చూసుకుంటారట. అయితే భార్యకు బానిసగా మారే విషయంలో మాత్రం వీరులో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందట.
మిథున రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు కూడా తమ జీవిత భాగస్వామిని ప్రేమగా చూసుకుంటారు కానీ తేడా వస్తే మాత్రం వీరు భార్యతో మాట్లాడకుండా మౌనంగా ఉంటారట. ఈ రాశి జాతకులు కూడా ఎప్పటికీ భార్యలకు బానిసలుగా మారరట.
కర్కాటక రాశి: ఈ రాశిలో పుట్టిన మగవారికి భార్యలంటే ఎనలేని ప్రేమ ఉంటుందట. భార్యే లోకంగా బతుకుంటారట. వీరు భార్య మాట జవదాటరట. ఇక వీరు సదా తమ భార్యలకు బానిసలుగా ఉంటారట.
సింహ రాశి: ఈ రాశి జాతకులు కూడా చాలా ప్రేమగా భార్యను చూసుకుంటారట. రాశి పేరులో సింహం ఉంటుంది కానీ ఈ రాశి జాతకులు భార్య దగ్గర మాత్రం పిల్లిలా మారిపోతారట. వీళ్లు కూడా జీవితాంతం భార్యకు బానిసగా బతుకుతారట.
కన్యా రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు కూడా భార్య ప్రేమలో మైమరచిపోతారట. జీవిత భాగస్వామికి జీవితాంతం సేవలు చేయడంలో ఈ రాశి భర్తలు ముందుంటారట. భార్యలను వీరు చూసుకున్నంత ప్రేమగా మరే రాశి జాతకులు చూసుకోరట.
తులా రాశి: ఇక ఈ రాశి జాతకులు కూడా తమ భార్యకు బానిసలుగా బతుకుతారట. వీరికి తమ పార్ట్‌నర్ మీద ఎనలేని ప్రేమ ఉంటుందట. తమ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు చేయడానికి బాగా ఇష్టపడతారట.
వృశ్చిక రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు కొంచెం డిఫరెంట్‌గా ఉంటారట. సమయానుకూలంగా మసలుకుంటారట. కొన్ని సందర్భాలలో భార్యకు బానిసగా ఉంటే మరికొన్ని సందర్భాలలో తాను చెప్పిందే తన జీవిత భాగస్వామి వినాలనుకుంటారట.
ధనస్సు రాశి: ఈ రాశి జాతకులు కూడా భార్యకు బానిసగా మారడానికి ఇష్టపడరట. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం భార్య మాట జవదాటరట. అలాగే తమ పార్ట్‌నర్ విషయంలో కేర్ తీసుకుంటారట.
మకర రాశి: అన్ని రాశుల కన్నా ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు తమ భార్యలకు ఎటువంటి సందర్భంలోనూ బానిసలుగా మారరట. పైగా భార్యను పూచికపుల్లతో తీసేస్తారట. వీరు చెప్పిందే వేదం అన్నట్టు తమ లైఫ్ పార్ట్‌నర్ బతకాలని ఆర్డర్ వేస్తుంటారట.
కుంభరాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు కూడా తమ భార్యలకు బానిసలుగా మారి సేవలు చేస్తుంటారట. భార్య కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారట.
మీన రాశి: ఈ రాశి జాతకులు కూడా ఎప్పటికీ తమ భార్యలకు బానిసలుగా ఉండటానికి ఇష్టపడరట. వ్యక్తిత్వంలో ఎంత సున్నితంగా ఉంటారో భార్య విషయంలో మాత్రం మొత్తం తాను చెప్పిందే నడవాలని కోరుకుంటారట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: మీకు చెడు రోజులు ప్రారంభమయ్యే ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయట