Puri Jagannath Rath Yatra: ఆషాఢంలో వివాహాలు, శుభకార్యాలు జరగకపోయినా ఈ నెల కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వాటిలో పూరీ జగన్నాథుని రథయాత్ర. ఈ యాత్రను దగ్గరుండి చూడాలి కోరుకునే వారు ఎక్కువమంది ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన వాటిలో పూరి జగన్నాధ క్షేత్రం ఒకటి. జూన్ 27న అంటే శుక్రవారం జగన్నాథుని రథయాత్ర గురించి డీటేల్స్ మీకోసం.
హిందువులు అతి పవిత్రంగా భావించే క్షేత్రాల్లో కీలకమైనవి నాలుగు క్షేత్రాలు. వాటిలో బద్రీనాథ్, పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకా. వీటిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తొలుత పూరి జగన్నాథ్ యాత్ర విషయానికి వద్దాం. ప్రతీ ఏడాది ఆషాఢ మాసంలోని శుద్ధ విదియ రోజున జగన్నాథుని యాత్ర జరుగుతుంది.
భువనేశ్వర్ నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో పూరీ పట్టణం ఉంది. పూరి పట్టణంలో ఉన్న జగన్నాథుని ఆలయం ఉంది. 12వ శతాబ్దంలో కళింగ రాజ్యాన్ని పరిపాలించే అనంతవర్మ చోడగంగా దేవ ప్రారంభించినట్టు చెబుతారు. కాకపోతే అంతకుముందు ఈ ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని చరిత్ర చెబుతోంది.
ఒక రోజు రాత్రి ఇంద్రద్యుమ్నునికి స్వప్నంలో జగన్నాథుడు కనిపించి చాంకీ నది ముఖ ద్వారానికి వేప కొయ్యలు కొట్టుకు వస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. జగన్నాథుడు చెప్పినట్లుగా జరిగింది. కాకపోతే విగ్రహాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దేవ శిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో ఇంద్రద్యుమ్నునికి దర్శనమిస్తాడు.
ALSO READ: సంపదకు ఆది దేవుడు కుబేరుడు చెప్పిన నాలుగు రహస్యాలు
విగ్రహాలకు తాను రూప కల్పన చేస్తానని చెబుతాడు. అందుకు కొన్ని షరతులు విధిస్తాడు. విగ్రహాలు తయారీలో తాను మంచినీళ్లు తీసుకోనని, అవ పూర్తి తయారయ్యే వరకు అంటే దాదాపు 21 రోజులు అటు వైపు ఎవరూ రాకూడదని చెబుతాడు. చివరకు రాజు సైతం అంగీకరిస్తాడు. విగ్రహాలు తయారు మొదలు పెట్టిన నుంచి ఆ గది నుంచి ఎలాంటి శబ్దం రాదు.
రోజులు గడిచిపోతున్నా ఎలాంటి సందడి లేకపోవడంతో అసహనానికి గురైన రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో రాజు తలుపులు తెరిపిస్తాడు. తలుపు ఓపెన్ చేయగానే సగం చెక్కిన విగ్రహాలు దర్శనమిస్తాయి. చివరకు కాళ్లు, చేతులు లేని సగం చెక్కిన విగ్రహాలు చూసి రాజు బ్రహ్మదేవుని ప్రార్ధిస్తాడు. ఆలయంలో విగ్రహాలు ఇకపై ఇదేవిధంగా దర్శనమిస్తాయని చెబుతాడట.
ఆ రూపంలో విగ్రహాలకు భక్తులు పూజలు చేస్తారని చెబుతాడు. వాటిని తాను స్వయంగా ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు. పూరి జగన్నాథ్ ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం, వరద హస్తం ఉండవు. విగ్రహాలకు ఇంతింత కళ్లు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఆనాటి నుంచి పూరీ జగన్నాథుడి ఆలయం ఆవిధంగా పూజలు అందుకుంటుంది.
దీనికి మరో వెర్షన్ కూడా ఉంది. స్థల పురాణం ప్రకారం జగన్నాథుడు గిరిజనుల దేవుడని అంటారు. గిరిజనుల రాజు విశ్వావసుడు అడవిలో ఓ రహస్య ప్రదేశంలోని జగన్నాథుణ్ని పూజలు చేశాడని చెబుతున్నారు. ఆ విషయం తెలుసుకున్న మహారాజు ఇంద్రద్యుమ్న ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి ఓ బ్రాహ్మణ యువకుణ్ని ఆ ప్రాంతానికి పంపిస్తాడు.
ఆ సమయంలో బ్రహ్మణ యువకుడు రాజు విశ్వావసుని కూతురు లలితను ప్రేమించి పెళ్లాడుతాడు. బ్రహ్మణ యువకుడు విద్యాపతి తన మామ విశ్వావసుని జగన్నాథుని విగ్రహాలను చూపించమని ప్రాధేయపడతాడు. చివరకు కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు రాజు. ఆ దారి తెలుసుకునేందుకు ఆ దారి పొడుగునా ఆవాలు జార విడుస్తాడు విద్యాపతి.
వాటి ద్వారా జగన్నాథుని ఆలయానికి దారి తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే జగన్నాథుని చూడటానికి ఇంద్రద్యుమ్న మహారాజు అడవికి చేరుకుంటాడు. అప్పటికే విగ్రహాలు మాయం అవుతాయి. నిరాశ చెందిన ఇంద్రద్యుమ్నుడు అశ్వమేథయాగం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఆలయంలో కీలకమైన విభాగాల్లో గిరిజనులు ఉంటారని చెబుతున్నారు.
సూచన.. పైన తెలిపిన వివరాలు వివిధ శాస్త్రాల్లో ప్రస్తావించిన ఆధారంగా ఇవ్వబడినవి. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవన్న విషయాన్ని గమనించగలరు.