Bigg Boss 9 Buzz Host: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో కూడా బిగ్ బాస్ కార్యక్రమానికి మంచి ప్రేక్షకాదరణ ఉంది. ఇప్పటికే తెలుగులో 8 సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ అతి త్వరలోనే తొమ్మిదవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది. తాజాగా స్టార్ మా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని కూడా అధికారకంగా తెలియజేశారు.
గెలుపు కోసం యుద్ధం చేయాలి?
తాజాగా బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss Season 9) లోగోని లాంచ్ చేస్తూ ప్రోమో విడుదల చేశారు. ఇందులో భాగంగా నాగార్జున (Nagarjuna) మాట్లాడుతూ ఆటలో అలుపు వచ్చినంత ఈజీగా గెలుపు రాదని గెలుపు రావాలి అంటే యుద్ధం చేయాలి అంటూ చెప్పుకువచ్చారు. బిగ్ బాస్ ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ నాగార్జున చెప్పిన ఈ వ్యాఖ్యలు ఈ కార్యక్రమం పై అంచనాలను పెంచేయడమే కాకుండా ఈసారి విభిన్నమైనటువంటి టాస్కులను కూడా నిర్వహించబోతున్నారని స్పష్టమవుతుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా ఉండరని వార్తలు వచ్చాయి కానీ ఈ ప్రోమోతో ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ అనే విషయంపై క్లారిటీ వచ్చింది.
హోస్ట్ నాగార్జున
ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంతో పాటు బిగ్ బాస్ బజ్(Bigg Boss Buzz Host) కార్యక్రమం కూడా ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా హౌస్ నుంచి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వారు ఈ బజ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ గత సీజన్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్ హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉంటారు. మరి తొమ్మిదవ సీజన్ లో ప్రసారం కాబోతున్న బజ్ కార్యక్రమానికి హోస్ట్ ఎవరు అనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా మాజీ కంటెస్టెంట్ ప్రేరణ (Prerana)రాబోతున్నట్టు సమాచారం.
బజ్ హోస్ట్ ప్రేరణ..?
గత సీజన్లో పలువురు లేడీ కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ప్రేరణ మాత్రం అందరికీ గట్టి పోటీ ఇస్తూ టాప్ 5 వరకు వెళ్లారు. దీంతో ఈసారి ఈమెకే బజ్ హోస్ట్ గా వ్యవహరించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ కార్యక్రమానికి కూడా మంచి ఆదరణ వస్తుందని చెప్పాలి. మామూలుగానే ప్రేరణ తన మాటలతో అందరిని నవ్విస్తూ సందడి చేస్తుంటారు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లను ప్రశ్నించడానికి రాబోతున్నారు అంటే ఈ కార్యక్రమం పై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి నిజంగానే ప్రేరణ బజ్ హోస్టుగా రాబోతున్నారా? లేదా అనే విషయాలు తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. ఇక ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లో ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి కావచ్చినట్టు సమాచారం. ఇక ఈసారి కూడా సీరియల్ సెలబ్రిటీలతోపాటు సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నారని సమాచారం.
Also Read: Bigg Boss Season 9 Promo : ఈ సారి రణరంగమే… బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేసింది