హిందూ పురాణాలు చెబుతున్న ప్రకారం ప్రతి దేవుడికి ఒక దైవిక శక్తి ఉంటుంది. అలాగే వారికి ప్రత్యేక ఆయుధాలు, వాహనాలు కూడా ఉంటాయి. సరస్వతి దేవి హంసపై స్వారీ చేస్తుండగా, విష్ణువు సర్పమైన శేషునిపై విశ్రాంతి తీసుకుంటాడు. అలాగే సంపదకు దేవుడైన కుబేరుడికి కూడా వాహనం ఉంది. ఆ వాహనం ఏదో తెలుసా? ఏ పక్షో, జంతువో కాదు.. మానవుడే. నర వాహనంపైనే అతడు స్వారీ చేస్తాడు. అంటే కుబేరుడు డబ్బుతో మనిషిని ఆడిస్తున్నాడు. అయితే కుబేరుడు నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన డబ్బు పాఠాలు కొన్ని ఉన్నాయి. అవి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
డబ్బును ఆ ఛాన్స్ ఇవ్వద్దు
కుబేరుడు మనిషి పైనే స్వారీ చేయడం అనేది ఒక స్పష్టమైన సత్యాన్ని సూచిస్తుంది. డబ్బుకు మనం సేవ చేయడానికి లేదా మనల్ని బానిసలుగా చేసుకోవడానికి కాదు. డబ్బు మిమ్మల్ని నియంత్రించకూడదు… మీరే డబ్బును నియంత్రించాలి. కుబేరుడు కూడా అదే చెబుతున్నాడు. డబ్బుకు మీరు లొంగిపోకుండా మీ జీవితాన్ని మీరు గడపాలి. బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును చూసి మానసిక ప్రశాంతతను పొందకూడదు. డబ్బును ఆదా చేయండి. పెట్టుబడులు పెట్టండి. ఖర్చు చేయండి. డబ్బు మీకు మీ అవసరాలను తీర్చే ఒక ఆయుధంగా మాత్రమే ఉంచుకోండి. అంతేకానీ డబ్బు కోసమే బతుకు వద్దు.
డబ్బుతో వీటిని కొనలేము
జీవితంలో జరిగిన ఒక సంఘటన డబ్బుతో విలువైన వాటిని కొనలేమని సూచిస్తుంది అతడు దైవిక శక్తిని కలిగి ఉన్నవాడే ఒకరోజు పార్వతీదేవి కోపానికి గురవుతాడు అప్పుడు ఆమె అతని కంటిలో ఒక దాన్ని కొట్టి ఆంధ్రుడిని చేస్తుందని చెబుతారు సంపదకు అధిపతి అయిన కుబేరుడు కోల్పోయిన దృష్టిని తన సంపదతో కొనలేకపోయాడు అందుకే కుబేరుడికి ఒక కన్ను బంగారు రంగులో కనిపిస్తుంది ఎంత అపారమైన సంపద ఉన్నప్పటికఎంత అపారమైన సంపద ఉన్నప్పటికీ ఆరోగ్యం సమయం శాంతి ప్రేమ వంటివి డబ్బుతో కొనలేని గుర్తించుకోండి కాబట్టి డబ్బు కోసం కాకుండా మీ అనుబంధాలు అంతర్గత శాంతి కోసం డబ్బును వినియోగించుకోండి
డబ్బును దాచేయకండి
కుబేరుడి పక్కన ఒక చిన్న జంతువు ఉంటుంది. దాని పేరు ముంగిస. ఇది విషపూరిత పాములతో పోరాడుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం పాములు దాచిన నిధులను సూచిస్తాయి. వాటిని కాపలాగా కాపాడుతూ ఉంటాయి. కుబేరుడు పక్కన ఉన్న ముంగిస ఒక లోతైన సందేశాన్ని మనకు చెబుతుంది. నిజమైన సంపద ధైర్యం, తెలివిలోనే ఉంటుంది.. నిల్వ చేయడంలో కాదు. అందుకే దాచిన నిధులకు కాపలాకాసే పాములతోనే ముంగిసలు పోరాడుతాయి. దాచిన డబ్బు పాము కాపలాగా ఉన్న నిధి లాంటిది. దురాశ, దురదృష్టాన్ని అది ఆకర్షిస్తుంది. డబ్బు ప్రవహించినప్పుడే జీవితంలో స్వీయ సంరక్షణ, ఖర్చు పెట్టడం, పెట్టుబడులు పెట్టడం వంటివి ఉంటాయి.
తెలివిగా ఉపయోగించుకోండి
కుబేరుడు సంపదకు దేవుడు కావడానికి చాలా కాలం ముందే అతను రాజుగా ఉండేవాడు. అప్పుడు కూడా ఎంతో ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. కుబేరుడి సవతి సోదరుడు రావణుడని చెప్పుకుంటారు. దురాశతో సవతి సోదరుడైన రావణుడు కుబేరుడిని ఓడించి లంక రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడని అంటారు. కుబేరుడు లంక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కానీ దానిని రక్షించడంలో, సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు. దీనివల్ల రావణుడి తెలివితేటలతో దాన్ని దక్కించుకున్నాడు. సంపద సంపాదించే వాడికి దానిని తెలివిగా రక్షించుకోవడం కూడా రావాలి. లేకుంటే ఇతరులు దానిని కాజేసి లేదా స్వాధీనం చేసుకొని వినియోగిస్తారు. డబ్బు ఎప్పుడైనా సంపాదించే వ్యక్తి దగ్గర విధేయంగా ఉండదు. ఆ డబ్బును తెలివిగా ఖర్చు చేసే వ్యక్తితోనే ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి డబ్బును బ్యాంకు ఖాతాలో వేసి రక్షించే కన్నా పెట్టుబడులుగా మార్చి తెలివిగా రెట్టింపు చేయడం మంచిది.