IND VS AUS, 4th T20I: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా (Australia vs India, 4th T20I) మధ్య ఇవాళ నాలుగో టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు జట్ల మధ్య మూడు టీ20 లు పూర్తి కాగా, 3 వన్డేల సిరీస్ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఈ టీ20 సిరీస్ లో 1-1 తేడాతో సమంగా ఉంది. ఇలాంటి తరుణంలోనే ఇవాళ నాలుగో టీ20కి రెండు జట్లు సిద్ధమయ్యాయి. ఇందులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇవాళ్టి మ్యాచ్ లో ఏకంగా 4 మార్పులతో కంగారులు బరిలోకి దిగుతున్నారు. అటు టీమిండియా మాత్రం ఎలాంటి మార్పులు లేకుండానే వస్తోంది.
Also Read: RCB: బెంగళూరుకు కొత్త కోచ్..WPL 2026 టోర్నమెంట్, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న నాలుగో టి20 మ్యాచ్ క్వీన్స్ లాండ్ లోని కరారా ఓవల్ వేదికగా ( Carrara Oval, Queensland) జరుగుతోంది. ఎప్పటిలాగే 1:45 గంటలకు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇవాళ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే ప్రమాదం పొంచి ఉందట. నిజంగానే వర్షం పడితే ఈ మ్యాచ్ లో మొదటి బౌలింగ్ చేసిన జట్టుకు అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. వర్షం పడితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న నాలుగో టి20 మ్యాచ్ ను జియో హాట్ స్టార్ ఉచితంగానే తిలకించవచ్చును. అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ లు ప్రసారం కానున్నాయి. ఇక రెండు జట్ల మధ్య బలా బలాలు చూసుకున్నట్లయితే.. ఇప్పటి వరకు టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 35 టీ20 లు జరిగాయి. ఇందులో 21 మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అటు ఆస్ట్రేలియా కేవలం 12 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. రెండు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. ప్రస్తుత టీ20 సిరీస్ లో చెరో మ్యాచ్ గెలిచి, అద్భుతంగా రాణించాయి రెండు జట్లు.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ (w), శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (w), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా