Indian Army Upgrades: పాక్‌కు ముచ్చెమటలు పట్టించేలా కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణ రంగంలో టైర్నింగ్ పాయింట్ అనేలా.. ఏకంగా రూ.67,000 కోట్ల విలువైన డిఫెన్స్ కొనుగోలు ప్రణాళికలకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) ఆగస్టు 5న ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన ఈ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలతో భారత త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అన్నీ గణనీయంగా మెరుగుపడనున్నాయి. శత్రు దేశాల కదలికలు నిక్షిప్తంగా గమనించి, తక్షణ చర్యలకు ఉపకరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మెగా డిఫెన్స్ ప్యాకేజీని ప్రకటించింది.
ఇండియన్ ఆర్మీకి కీలకమైన BMP వెహికల్స్ కోసం థర్మల్ ఇమేజర్ ఆధారిత డ్రైవర్ నైట్ సైట్స్ కొనుగోలుకు ఆమోదం లభించింది. వీటి వల్ల చీకటి వేళలలోనూ మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ దళాలు కదలికలను సమర్థవంతంగా కొనసాగించగలవు. అంటే ఇక రాత్రి దండయాత్రలు సాధారణ విషయంగా మారబోతున్నాయన్నమాట. శత్రువులపై ఆకస్మిక దాడులు, రెస్క్యూ ఆపరేషన్లలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి.
భారత నౌకాదళానికి మరింత శక్తి చేకూర్చేందుకు ‘కాంపాక్ట్ ఆటోనమస్ సర్ఫేస్ క్రాఫ్ట్’ల కొనుగోలుకు ఆమోదం లభించింది. ఈ క్రాఫ్ట్‌లు సముద్ర తళంలో చలించే శత్రు సబ్‌మరైన్‌లు, ఇతర ప్రమాదకర వస్తువులను గుర్తించి వాటిని ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. దీనితో పాటు, బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్, లాంచర్స్, BARAK-1 మిసైల్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఇవన్నీ కలిసి భారత నౌకాదళాన్ని మరింత గగనతల స్థాయిలో నిలబెడతాయి.
Also Read: AP Cabinet: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. ఒకటి కాదు సుమా.. అవేమిటంటే?
భారత వైమానిక దళానికి మౌంటెయిన్ రాడార్లు, SAKSHAM, SPYDER వేపన్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లు మంజూరయ్యాయి. మౌంటెయిన్ రాడార్లు హిమాలయ ప్రాంతాల్లోనూ, ఎత్తైన సరిహద్దుల్లోనూ శత్రు కదలికలను ముందుగానే గుర్తించి సమాచారాన్ని అందించగలవు. ఇక SPYDER సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌కి అనుసంధానం చేయడం వల్ల దేశ వైమానిక రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుంది.
ఈ మొత్తం కొనుగోళ్లలో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇవన్నీ ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా, దేశీయంగా తయారు చేయబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే విదేశాలపై ఆధారపడకుండా, మనం స్వయంగా తయారుచేసే ఆయుధాలతో మన దేశ రక్షణను గట్టిపరిచే దిశగా మరో మెట్టు ఎక్కినట్లే. ఇది దేశీయ డిఫెన్స్ పరిశ్రమకు కూడా భారీ బూస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ భారీ డిఫెన్స్ నిర్ణయాల వెనక శత్రువులను అదుపులో పెట్టాలనే ఉద్దేశమే ఉన్నా.. దీని ప్రభావం అంతకన్నా గొప్పది. చీకటి రాత్రుల్లో సైతం కదిలే సైనిక శక్తి, సముద్రపు లోతుల్లోనూ కనిపించే నావిక దళం, కొండల్లో కూడా కవర్ చేసే రాడార్‌లు.. ఇవన్నీ కలిసే శత్రువులకు షాక్ తగిలించబోతున్నాయి. రక్షణ రంగం ఇప్పుడు టెక్నాలజీతో పునః నిర్వచించబడుతోంది. ఇది కేవలం ఆయుధాల కొనుగోలు మాత్రమే కాదు, ఇది భద్రతపై భారత ప్రభుత్వంలోని నమ్మకానికి నిదర్శనం.