BigTV English

Danush -Mrunal: ధనుష్, మృణాల్ ఠాకూర్ రిలేషన్ నిజమేనా…అలా హింట్ ఇచ్చిన నటి!

Danush -Mrunal: ధనుష్, మృణాల్ ఠాకూర్ రిలేషన్ నిజమేనా…అలా హింట్ ఇచ్చిన నటి!

Dhanush – Mrunal: సినీనటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ప్రస్తుతం సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా సౌత్ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఇటీవల ఈమె పెద్ద ఎత్తున వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. గత రెండు రోజులుగా మృణాల్ ఠాకూర్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 1వ తేదీ ఈమె తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అయితే ఈ పుట్టిన రోజు వేడుకలలో భాగంగా కోలీవుడ్ హీరో ధనుష్ (Danush) కనిపించడంతో వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.


పుట్టినరోజు వేడుకలలో ధనుష్..

మృణాల్, ధనుష్ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని అందుకే ఇలా ఆమె పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్నారని వార్తలు వినపడుతున్నాయి. ఇక ఈ పుట్టిన రోజు వేడుకలలో భాగంగా వీరిద్దరూ చాలా క్లోజ్ గా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో కూడా నటించలేదు కానీ ఇద్దరి మధ్య ఇంత చనువు ఉండడంతోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ కోసం ప్రత్యేకంగా ధనుష్ వెళ్లడం గమనార్హం.


ధనుష్ కుటుంబ సభ్యులకు పరిచయం చేశారా?

ఇదిలా ఉండగా తాజాగా వీరి రిలేషన్ కి సంబంధించి మరొక వారితో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ ఇంస్టాగ్రామ్ వేదికగా ధనుష్ ఇద్దరు సోదరీమణులు డాక్టర్ కార్తిక, విమల గీతలను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ధనుష్
మృణాల్ ఠాకూర్ ను తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశారని వార్తలు బయటకు రావడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమేనని ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే ఈమె ఇలా ధనుష్ అక్కలను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ హింట్ ఇచ్చారని అభిమానులు భావిస్తూ ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ఐశ్వర్య రజినీకాంత్ తో విడాకులు…

గత మూడు రోజులుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇప్పటివరకు ఈ ఇద్దరు ఎక్కడ స్పందించలేదు. ఇకపోతే ధనుష్ ఇటీవల తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) కు విడాకులు (Divorce) ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా విడాకులు తీసుకున్న తర్వాత ఈయన తరచూ ఇలాంటి వార్తలలో నిలుస్తున్నారు. ఇదివరకు నటి మీనాను రెండో వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తల పట్ల మీనా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించారు. ఇంకోసారి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటానని కూడా ఆమె హెచ్చరించారు. ఇలా ఈ వార్తలకు పులిస్టాప్ పడినప్పటికీ తాజాగా ధనుష్ , మృణాల్ తో రిలేషన్ లో ఉన్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఇక కెరియర్ పరంగా ధనుష్ కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఈయన కుబేర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు .ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో ధనుష్ బిజీగా గడుపుతున్నారు.

Also Read: Kingdom Film: తమిళ ప్రజలంటే మాకు గౌరవం.. దెబ్బకు దిగొచ్చిన కింగ్డమ్ నిర్మాతలు!

Related News

War 2 Song Teaser: అదరగొట్టేసిన డాన్స్ ఐకాన్స్.. రెండు కళ్ళు చాల్లేదు గురూ!

Kajol : కాజోల్‌ను హిందీలో మాట్లాడమన్న విలేకరి.. ఆమె సమాధానం విని అంతా షాక్..

Allu Arjun : బాలీవుడ్ బడా హీరోతో బన్నీ మూవీ..బాక్సాఫీస్ పరిస్థితి ఏంటబ్బా..?

PVNS Rohit: మొన్న నేషనల్ అవార్డు.. నేడు నిశ్చితార్థం.. జోరు పెంచిన బేబీ సింగర్!

Rajinikanth : రజినీకాంత్ మనసు బంగారమే మామా.. 350 మందికి సాయం..

Actor Shot dead:కాల్పుల్లో హీరో మృతి… సాయం చేయడానికి వెళ్లి పరలోకానికి

Big Stories

×