Vastu Tips: హిందూ సంప్రదాయంలో పూజ గదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇంట్లోని పూజ గది శాంతి, ప్రశాంతత, సానుకూల శక్తికి మూలం అని చెబుతారు. ఇలాంటి పూజ గదిని నిర్లక్ష్యం చేస్తే లేదా వాస్తు నియమాలకు విరుద్ధంగా పూజా గది ఉంటే అది ఇంట్లో ప్రతికూల వాతావరణానికి దారితీస్తుంది. మీ ఇంట్లో ఉండే పూజా గది విషయంలో ఎలాంటి వాస్తు టిప్స్ పాటిస్తే మంచిదనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. పూజ గది దక్షిణం వైపు ఉందా?
వాస్తు ప్రకారం.. పూజ గది ఎప్పుడూ దక్షిణం వైపు ఉండకూడదు. దక్షిణం వైపును యముడికి సంబంధించిన దిక్కుగా చెబుతారు . ఈ దిశలో పూజ గది ఉండటం అశుభం. ఇది ఇంట్లో ఆర్థిక సమస్యలను, అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది. పూజ గదికి ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలు చాలా మంచవి .
2. విగ్రహాలు, ఫోటోలు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయా ?
పూజ గదిలో విగ్రహాలు లేదా ఫోటోలు ఒకదానికొకటి చాలా దగ్గరగా పెట్టకూడదు. విగ్రహాల మధ్య కొంత ఖాళీ ఉండేలా చూసుకోవాలి. అలాగే.. ఒకే దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు ఒకటి కంటే ఎక్కువ పెట్టకూడదు. ఇది ఇంట్లో అశాంతిని, కలహాలు పెరిగేందుకు కూడా కారణం అవుతుంది.
3. దేవుని గదిలో చెత్త, పాడైన వస్తువులు ఉన్నాయా ?
పూజ గదిలో పగిలిన విగ్రహాలు, చిరిగిపోయిన ఫోటోలు, వాడిపోయిన పువ్వులు లేదా వాసన లేని అగరబత్తీలు వంటివి ఉండకూడదు. ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా, పవిత్రంగా ఉంచాలి.
4. పూజ గది బాత్రూం లేదా టాయిలెట్‌కి పక్కన ఉందా?
పూజ గదికి పక్కన లేదా గోడను ఆనుకుని బాత్రూం లేదా టాయిలెట్ ఉండటం చాలా పెద్ద వాస్తు దోషం. ఇది ఇంట్లో శుభకార్యాలకు అడ్డంకులు సృష్టిస్తుంది. అలాగే.. ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పెంచుతుంది.
5. పూజ గదిలో బరువున్న వస్తువులు ఉన్నాయా?
దేవుని గదిలో బరువైన వస్తువులు, అనవసరమైన వస్తువులను పెట్టకూడదు. ఇది ఆ గదిలో సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. పూజ గది ఎప్పుడూ తేలికగా, గాలి, వెలుతురు వచ్చేలా ఉండాలి.
Also Read: శ్రావణ మాసంలో చివరి సోమవారం ఈ పూజ చేస్తే.. సకల సంపదలు
6. దేవుని విగ్రహాలు తలుపులకు ఎదురుగా ఉన్నాయా ?
పూజ గదిలో దేవుని విగ్రహాలు, ఫోటోలు ఎప్పుడూ పూజ గది తలుపులకు ఎదురుగా ఉండకూడదు. ఇది ఇంటిలోకి వచ్చే సానుకూల శక్తిని అడ్డుకుంటుంది.
మీ పూజ గదిలో పై వాటిలో ఏదైనా ఉన్నట్లయితే.. దానిని సరిదిద్దుకోవడం మంచిది. వాస్తు నియమాలను అనుసరించి పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. పూజ గదిని పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవడమే ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోవచ్చు.