BigTV English

Sun ketu Conjuction: సూర్యకేతువుల అరుదైన కలయిక, జూలై 7 నుండి ఈ మూడు రాశుల వారికి మంచి రోజులు మొదలు

Sun ketu Conjuction: సూర్యకేతువుల అరుదైన కలయిక, జూలై 7 నుండి ఈ మూడు రాశుల వారికి మంచి రోజులు మొదలు

జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక జాతక చక్రంలో ముఖ్యమైన గ్రహం. అలాగే కేతువు కూడా ప్రధానమైనవాడు. వీరిద్దరూ మంచి స్థానాల్లో ఉంటే ఫలాలు సానుకూలంగా ఉంటాయి. సూర్యుడు నక్షత్రం మారడానికి ఒక నెల రోజుల సమయం తీసుకుంటాడు. ఇక కేతువు ఏడాదిన్నర కాలం పాటు ఒకే నక్షత్రంలో ఉంటాడు. ఇప్పుడు వీరిద్దరూ కూడా తమ నక్షత్రాలు మార్చుకోబోతున్నారు. సూర్యుడు జూలై 6న పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు.


పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు. ఇక కేతువు పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇక ఈ నక్షత్రం అధిపతి శుక్రుడు. ఈ రెండు మార్పుల వల్ల జూలై 7 నుండి మూడు రాశుల వారికి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ మూడు రాశుల్లో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.

మేషరాశి
జూలైలో సూర్య కేతు సంచారం వల్ల మేష రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. వారి కెరీర్లో ముందడుగు పడుతుంది. గౌరవం కూడా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. కొత్త ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు. సూర్య కేతు సంచారం అనేది మేష రాశి వారికి అన్ని విధాలా మేలే చేస్తుంది.


సింహరాశి
సూర్యుడు కేతు గ్రహాలు నక్షత్రాలను మార్చుకోవడం వల్ల సింహరాశిలో పుట్టిన వారికి కెరీర్లో వృద్ధి కనిపిస్తుంది. ఇది ఆర్థిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దూర ప్రయాణం చేసే అవకాశం రావచ్చు. ఆధ్యాత్మికంగా మీకు ఆసక్తి కలుగుతుంది. పూజలు, పునస్కారాలు చేస్తారు. ఇక వ్యాపారవేత్తలు పెద్ద ప్రాజెక్టును ఖరారు చేసుకునే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి.

కుంభ రాశి
సూర్య కేతు నక్షత్ర మార్పులు కుంభ రాశి వారి జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తాయి. వీరికి కెరీర్లో కొత్త ఉద్యోగం, లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మంచి పనులు చేసే ప్రశంసలు కూడా పొందుతారు. ఏదైనా ఒక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే వీరికి ఆర్థిక ప్రయోజనాలు కూడా పుష్టిగా కనిపిస్తున్నాయి.

Related News

Peepal Tree: ఇంటి గోడపై రావి చెట్టు పెరగడం శుభమా ? అశుభమా ?

Tulsi Plant: వాస్తు ప్రకారం.. తులసి మొక్కను ఏ దిశలో నాటాలి ?

Ganesh Immersion: మీరు ఇంట్లోనే వినాయకుడి నిమజ్జనం చేస్తున్నారా ? ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి

Cats Scarified: 4 ఆలయాలు.. 4 పిల్లులు బలి.. ఆ గ్రామానికి అరిష్టమా?

Vastu Tips: వ్యాపారంలో లాభాలు రావాలంటే.. ?

Lord Ganesha: వినాయకుడికి.. ఈ వస్తువు సమర్పిస్తే మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయ్

Big Stories

×