BigTV English

Raw onions: మీకు తెలుసా? వీళ్లు ఉల్లిపాయలు అస్సలు తినకూడదు.. కాదని తింటే?

Raw onions: మీకు తెలుసా? వీళ్లు ఉల్లిపాయలు అస్సలు తినకూడదు.. కాదని తింటే?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో దాదాపు ఉల్లిపాయల్లో వినియోగిస్తారు. ఇది ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారంగానే చెప్పుకుంటారు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి కూడా పుష్టిగా ఉంటాయి. అయితే పచ్చి ఉల్లిపాయలు తినడం అందరికీ ఆరోగ్యకరం కాదు. కొంతమంది ఉల్లిపాయలు తినకూడని పరిస్థితులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఎవరు ఉల్లిపాయలు తినకూడదో తెలుసుకోండి.


ఐబీఎస్ ఉన్నవారు
ఐబీఎస్ అంటే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్. ఉల్లిపాయల్లో ఫక్టోన్స్ అనే ఒకరకమైన కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఐబీఎస్ ఉన్నవారికి ఈ ఫక్టోన్స్ త్వరగా జీర్ణం కావు. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. ఈ అంశంపై ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఐబీఎస్ తో బాధపడేవారు పచ్చి ఉల్లిపాయలు తినడం పూర్తిగా మానేయాలి. కావాలంటే ఉల్లిపాయలు బాగా ఉడికాక తినడం మంచిది. ఉల్లిపాయలను ఉడికించిన తర్వాత తినడం వల్ల ఫ్రక్టోన్ స్థాయిలు చాలా వరకు తగ్గుతాయి. మీకు ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉంటే డైటీషియన్ తో లేదా వైద్యులతో మాట్లాడాకే ఉల్లిపాయలను తినడం ఉత్తమం.

అలెర్జీలు ఉంటే
కొన్ని రకాల ఆహార పదార్థాలు కొంతమందిలో అలెర్జీలకు కారణం అవుతాయి. ఉల్లిపాయల వల్ల కూడా అలెర్జీ కలిగే అవకాశం ఉంది. అయితే చాలా అరుదుగా జరిగే అంశం ఇది. ప్రపంచంలో చాలా తక్కువ మందికి మాత్రమే ఉల్లిపాయలు అలెర్జీ ఉండే అవకాశం ఉంది. ఉల్లిపాయలు అలెర్జీ ఉన్నవాళ్లలో కళ్ళు దురద, ముక్కు కారటం, కడుపు ఉబ్బరం, చర్మంపై దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎప్పుడైతే మీరు పచ్చి ఉల్లిపాయను తిన్న వెంటనే ఈ అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. అలాగే పచ్చి ఉల్లిపాయ తిన్న తర్వాత వికారంగా అనిపిస్తున్నా, గుండెల్లో మంట, కడుపునొప్పి వంటివి వచ్చినా మీకు ఉల్లిపాయ పడడం లేదని అర్థం చేసుకోవాలి.


ఉల్లిపాయల్లో ఉండే డయాలిల్ డిసల్ఫైడ్ వంటి సమ్మేళనాలు అలెర్జీలకు కారణమవుతాయి. ఉల్లిపాయల అలెర్జీ ఉన్న కొంత మందికి వెల్లుల్లి అలెర్జీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఉల్లిపాయలను తినడం మానేస్తేనే మంచిది. లేదా అలెర్జీకి తగ్గట్టు మందులు కూడా వాడాలి.

గుండెల్లో మంట
కొంతమందికి తరచూ గుండెల్లో మంట వస్తూ ఉంటుంది. అలాంటివారు కూడా ఉల్లిపాయలను తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే పచ్చి ఉల్లిపాయలు తింటే పొట్టలో ఆమ్లతను నిరోధించే కండరాలను సడలించేలా చేస్తాయి. దీనివల్ల గుండెల్లో మంట ఎక్కువ అయిపోతుంది. ఆమ్లం కూడా అధికంగా ఉత్పత్తి అవుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఉల్లిపాయలు గుండెల్లో మంటను పెంచుతాయని తేలింది. కాబట్టి పచ్చి ఉల్లిపాయలను తినడం ఎంతో ప్రమాదకరం. మీకు గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తే పచ్చి ఉల్లిపాయలు పూర్తిగా మానేయండి. కేవలం వండిన ఉల్లిపాయలు తినేందుకే ప్రయత్నించండి.

రక్తస్రావం సమస్యలు
పచ్చి ఉల్లిపాయలు రక్తం గడ్డ కట్టడాన్ని నెమ్మదించేలా చేస్తాయి. గాయాలు తగిలినప్పుడు రక్తస్రావం అధికంగా జరిగే వారికి ఉల్లిపాయలు దూరంగా ఉంటేనే మంచిది. అలాగే ఆస్ప్రిన్, వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతున్న వారు కూడా పచ్చి ఉల్లిపాయలను తినకూడదు. ఎందుకంటే ఉల్లిపాయలో క్వెర్సెటిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని మరింత పలుచబరిచేలా చేస్తాయి. దీనివల్ల గాయాలు తగిలినప్పుడు రక్తస్రావం అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు రక్తస్రావం అధికంగా అయ్యే సమస్య ఉన్నా లేదా రక్తం పలుచబడే మందులు వాడుతున్నా ఉల్లిపాయకు దూరంగా ఉంటేనే మంచిది.

గర్భిణులు, పాలిచ్చే స్త్రీలు
గర్భంతో ఉన్నవారు లేదా చంటి బిడ్డలకు పాలిచ్చే స్త్రీలు కూడా పచ్చి ఉల్లిపాయలను తక్కువగా తినాలి. ఇది రక్తం పలుచన చేసే లక్షణం అధికంగా కలిగి ఉంటుంది. గర్భధారణ సమయంలో ఉల్లిపాయలు తక్కువగా తింటేనే మంచిది.

ఆపరేషన్ అయిన తర్వాత
ఉల్లిపాయలు రక్తం గడ్డ కట్టడాన్ని నెమ్మదించేలా చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రక్తస్రావం అధికంగా అయ్యే అవకాశాన్ని ఉల్లిపాయలు పెంచేస్తాయి. అలాగే రక్తంలో చక్కెర సమస్యలకు కూడా కారణం అవుతాయి. కాబట్టి పచ్చి ఉల్లిపాయలను ఏదైనా ఆపరేషన్ అయిన తర్వాత తినకపోవడమే మంచిది. శస్త్ర చికిత్సకు ముందు అంటే రెండు వారాల ముందే ఉల్లిపాయను తీసుకోవడం మానేయాలి. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఉల్లిపాయలను కొన్ని రోజులు పాటు తినకపోవడమే ఉత్తమం.

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×