BigTV English

Moon:చంద్రుడికి నైవేద్యం ఇచ్చే ఫలితాలు

Moon:చంద్రుడికి నైవేద్యం ఇచ్చే ఫలితాలు

Moon:మనకు ప్రత్యక్షదైవాలు ముగ్గురు. ఒకరు సూర్యుడు, మరొకరు చంద్రుడు, ఇంకొకరు అగ్నిదేవుడు. సూర్యుడికి నమస్కారం చేసుకుంటాం. చంద్రుడికి నూలుపోగు వేసి కృతజ్ఞత చెప్పుకుంటాం. మరి అగ్నిదేవుడూ… ఆయన్ను అర్చించేందుకే పూర్వం పెద్దలు ఇంట్లో నిత్యాగ్నిహోత్రం నిర్వహించేవారు. రోజూ అగ్ని దేవుడిని ఆవాహన చేసి నమస్కారం చేసేవారు.


ప్రపంచానికి వెన్నెల వెలుగులు ఇస్తున్న దేవుడు చంద్రుడు. చంద్రునికి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు.అష్టమి నుంచి పౌర్ణమి వరకు చంద్రునికి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే.. గొప్ప ధనవంతులు అవుతారు. ప్రతిరోజూ రాత్రి పెరుగు అన్నాన్ని చంద్రునికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రసాదాన్ని అరటి ఆకులో సమర్పించాలి. అది కుదరకపోతే చిన్న వెండిగిన్నెలో పెట్టవచ్చు. అలాగే వీలైనంత వరకు అష్టమి నుంచి ప్రారంభించకపోయినా ద్వాదశి తిథి నుంచి పెరుగన్నంను చంద్రునికి నైవేద్యంగా సమర్పించవచ్చని సూచిస్తున్నారు.

అలాగే పేదలకు వస్త్రదానం చేయవచ్చు. వస్త్రాలు దానం చేయలేకపోయినా.. తువ్వాలు అయినా దానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. లేకుంటే నీలం రంగు రుమాలు దానం చేయడం ఉత్తమం. పౌర్ణమి రోజున మహానైవేద్యం చంద్రునికి పళ్ళెంలో పెట్టి, దానిని స్వయంగా భుజించాలి. ఎంతో నైవేద్యం పెట్టారో అది మాత్రమే తినాలి. ఇతర పదార్థాలు తీసుకోకూడదు. ఆ రోజున ఉపవసించాలి.
చంద్రుడు ప్రారబ్ధానికి దేవత. ఆయనకి నైవేద్యం పెట్టడం చేస్తే సంతృప్తి చెందుతాడు. నైవేద్యం చేసేటప్పుడు స్వచ్ఛమైన నేతి దీపం వెలిగించాలి. కిటికీ నుంచి లేదా ఇంటి పైకప్పు పైకి వెళ్లి చంద్రుణ్ణి చూసి నైవేద్యం సమర్పించాలి. ఇలా చేస్తే సంపద వృద్ధి చెందుతుందని… అయితే వృత్తిపరంగా సాధకుడు ప్రయత్నాలు చేస్తూ వుండాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.


Negative Energy:బ్లాక్ ఐతో నెగిటివ్ ఎనర్జీకి చెక్ పడుతుందా…

Camphor:ప్రసాదంగా వచ్చే పచ్చకర్పూరాన్ని ఇలా చేయచ్చు…

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×