BigTV English

Shadashtak Yoga: షడష్టక యోగం.. ఆగస్టు 16 వరకు వీరి జీవితంలో సమస్యలు

Shadashtak Yoga: షడష్టక యోగం.. ఆగస్టు 16 వరకు వీరి జీవితంలో సమస్యలు

Shadashtak yoga: సూర్యుడు 30 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. సూర్యుడు, కర్కాటక రాశిలోకి ప్రవేశించిన జులై 16న కర్కాటక సంక్రాంతిగా పిలుస్తారు. ఆగస్టు 16 వరకు సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటాడు. సూర్యుడి సంచారం, శని దాని మూల త్రికోణ రాశి అయిన కుంభ రాశిలో ఉండటం వల్ల షడష్టక యోగం ఏర్పడింది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు, శని ఒకరికొకరు ఆరు, అష్టమ గృహాల్లో ఉన్నప్పుడు షడష్టక యోగం ఏర్పడుతుంది.


సూర్యుడు, శని ద్వారా ఏర్పడిన షడష్టక యోగం జ్యోతిష్య శాస్త్రంలో అశుభకరమైనదిగా చెబుతారు. ఈ యోగం ఏర్పడడం వల్ల పలు రాశుల వారి జీవితల్లో అనేక మార్పులు జరుగుతాయి. షడష్టక యోగం వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి షడష్టక యోగం అంత కలసి కాదు. ఈ కాలంలో మీ విశ్వాసం ధైర్యం చాలా వరకు తగ్గుతుంది. డబ్బు సంపాదించినా కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకండి. లేకపోతే ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆగస్టు 16 వరకు షడష్టక యోగం వల్ల కష్టాలు ఎక్కువగా ఉంటాయి.
సింహ రాశి:
సూర్యుడు సింహ రాశికి అధిపతిగా చెబుతారు. అయినప్పటికీ సూర్యుడు, శని ద్వారా ఏర్పాటయిన షడష్టక యోగం మీకు ఆర్థిక సవాళ్లను తెచ్చిపెడుతుంది. మీ కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడతాయి. ఇంట్లో ఘర్షణ వాతావరణం కారణంగా అశాంతి నెలకొంటుంది. మీ జీవిత భాగస్వామి విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. దాని వల్ల మీ ఇద్దరి మధ్య తగాదాలు వచ్చే అవకాశం ఉంది.

కన్యా రాశి:


కన్యా రాశి వారికి సూర్యుడు, శని వల్ల ఏర్పడే యోగం అశుభ ఫలితాలను ఇస్తుంది. షడష్టక యోగం ప్రభావం వల్ల శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించే అవకాశముంది. కార్యాలయంలో జరిగే రాజకీయాలకు మీరు బలి అయ్యే ప్రమాదం ఉంది. ఈ కాలంలో డబ్బుకు సంబంధించి ఎలాంటి రిస్కు తీసుకోకపోవడం మంచిది. లేకుంటే ఆర్థిక నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. మీ గౌరవం, ప్రతిష్ట దెబ్బతినే అవకాశాలున్నాయి.
ధనస్సు రాశి :
ధనస్సు రాశి వారికి ఈ కాలం హెచ్చుతగ్గులతో కూడి ఉంటుంది. ఈ సమయంలో ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఉండడం మంచిది. లేకుంటే మీరు కోర్టుకు వెళ్లవలసి వస్తుంది. ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ఆఫీసులో ఇబ్బందులు తప్పవు. ఇక మీ వైవాహిక జీవితంలో కూడా ఈ సమయంలో సమస్యలు ఎదురవుతాయి.

Also Read: ఒకే రోజు శని సంచారం, సూర్య గ్రహణం.. వీరికి ధనలాభం

కుంభ రాశి:
శని, సూర్యునిచే ఏర్పడిన షడష్టక యోగం కుంభరాశి వారికి అశుభం కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు అనవసర వివాదాలలో చిక్కుకుంటారు. గాయాలు కూడా సంభవించవచ్చు. మీరు కొన్ని ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి .ఈ కాలంలో ఏ కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు. ఇది శుభ ఫలితాలను ఇవ్వకపోవచ్చు.

Tags

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×