Telangana News: ఏళ్లు గడుస్తున్నా పాత తరం నాటి గౌరవ మర్యాదలు వేరు. కొత్త అల్లుడికి మర్యాదలు అనగానే ఉభయ గోదావరి జిల్లాలు గుర్తుకు వస్తాయి. సంక్రాంతి లేదా మరేదైనా పండుగ కావచ్చు. అల్లుడికి చేసే మర్యాదలు వేరు. అలాంటి సంప్రదాయాన్ని ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కొందరు పాటిస్తున్నారు.
తెలంగాణ దసరా అల్లుడికి పంట
తాజాగా తెలంగాణలో దసరా పండుగకు వచ్చిన కొత్త అల్లుడికి అత్తమామలు భారీ విందు భోజనం ఏర్పాటు చేశారు. 100 రుచుల వంటకాలు వడ్డించారు. తులం బంగారు కూడా ఇచ్చారు. చెప్పగానికి విచిత్రంగా ముమ్మాటికీ నిజం.
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన సహన-సురేష్ దంపతులు కూతురుకి గత నెలలో వివాహం చేశారు. అల్లుడు నికిత్ వరంగల్ పట్టణానికి చెందినవాడు. వివాహం సమయంలో చేయాల్సిన వన్నీ చేశారు. పెళ్లయిన తర్వాత దసరా పండుగ రావడంతో తొలిసారి అల్లుడ్ని ఇంటికి ఆహ్వానించారు అత్తమామలు.
ఊహించని విధంగా షాకైన అల్లుడు
పసందైన వంటలతో కొత్త అల్లుడికి విందు భోజనం ఏర్పాటు చేశారు. మర్యాదల్లో ఉభయగోదావరి జిల్లాలకు ఏమాత్రం తీసిపోకుండా చేశారు. 101 రకాల పిండివంటలతో అల్లుడికి విందు భోజనం వడ్డించారు. అరిటాకులో సంప్రదాయ 30 రకాల పిండి వంటలు, 60 రకాల స్వీట్లు, అన్నంతో కలిపి భోజనాన్ని వడ్డించారు. వాటిని చూసి అల్లుడు షాకయ్యాడు.
ALSO READ: పాఠశాలలో క్షుద్రపూజలు, విద్యార్థుల్లో భయం
సరదాగా మామని ఆటపట్టించాలని ఒక్కటి తగ్గినా ఏమిస్తారని అడిగారు. అందుకు తులం బంగారం ఇస్తానని చెప్పారు. ఒక్కొక్కటి లెక్కించడం మొదలుపెట్టాడు అల్లుడు. 101 వంటకాలకు బదులు 100 రకాల పిండి వంటలు ఉన్నాయి. అన్నట్లుగా ఒక వంటకం తగ్గడంతో తులం బంగారం అల్లుడికి ఇచ్చారు అత్తమామలు.
జీవితంలో మర్చిపోలేని ఆతిథ్యం, తులం బంగారం రావడంతో నిఖిత్ ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఇప్పటికీ ఇలాంటి సంప్రదాయం ఏపీ, తెలంగాణల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అల్లుడ్ని ఇంటికి పిలిచి గౌరవంగా పంపడం కొనసాగుతోంది కూడా.
కొత్త అల్లుడికి 101 రకాల వంటకాలతో భోజనం
ఒక వంటకం తగ్గడంతో తులం బంగారం దక్కించుకున్న అల్లుడు
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన సింధు, నికిత్కు 2 నెలల క్రితం వివాహం చేసిన గుంత సురేష్, సహన దంపతులు
పెళ్లి తర్వాత వచ్చిన మొదటి దసరా పండుగకి అల్లుడికి 101… pic.twitter.com/ydn2kviNPw
— BIG TV Breaking News (@bigtvtelugu) October 4, 2025