Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనక్కర్లేదు. స్టార్ మా లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ సినిమాకి మించి పాపులర్ అయింది. అలా ఈ సీరియల్ లో యాక్ట్ చేసిన డాక్టర్ బాబు,వంటలక్క వంటి పేర్లు కూడా ఫేమస్ అయ్యాయి.వీళ్లు మాత్రమే కాదు విలన్ పాత్రలో నటించిన మోనిత కూడా చాలా ఫేమస్ అయింది. మోనిత అసలు పేరు శోభా శెట్టి.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన శోభా శెట్టి టాలీవుడ్ లో పలు బుల్లితెర సీరియల్స్ లో నటించింది.అయితే అలాంటి శోభా శెట్టి తాజాగా ఓ బిజినెస్ స్టార్ట్ చేయబోతోంది. మరి ఇంతకీ ఈ బ్యూటీ స్టార్ట్ చేయనున్న ఆ బిజినెస్ ఏంటి..? ఆ వివరాలు ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం..
బుల్లితెర నటి శోభాశెట్టి తాజాగా ఓ డిజైనర్ స్టూడియోస్ ని ఓపెనింగ్ చేస్తున్నట్టు తెలిపింది. ‘శోభా శెట్టి డిజైనర్ స్టూడియోస్’ అనే పేరుతో ఒక స్టూడియోని ఓపెనింగ్ చేయబోతున్నట్టు తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అఫీషియల్ గా బయటపెట్టింది. ఈ డిజైనర్ స్టూడియో విషయానికి వస్తే.. “శోభా శెట్టి డిజైనర్ స్టూడియోకి వస్తున్న మీ అఖండ మద్దతుకు మేం కృతజ్ఞులం..మా డిజైనర్ స్టూడియో అక్టోబర్ 5న ఓపెనింగ్ కి సిద్ధంగా ఉంది. అలాగే మీరు పంపే ప్రతి మెసేజ్ కి మేము రెస్పాండ్ అవ్వలేము.కానీ అక్టోబర్ 6 నుండి మీ నుండి ఆర్డర్లు తీసుకుంటాము. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. అలాగే మాకు మీ మద్దతు ఇలాగే ఉండాలి..మీ ప్రేమే అన్నింటికీ మూలం” అంటూ ఓ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం శోభా శెట్టి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్టుతో ఆమె డిజైనర్ స్టూడియోని ఓపెనింగ్ చేసి బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు అర్థమవుతుంది.అలా కొత్త బిజినెస్ లోకి అడుగుపెడుతున్న శోభా శెట్టి కి చాలామంది కంగ్రాట్స్ చెబుతూ ఆమె బిజినెస్ సక్సెస్ఫుల్ గా నడవాలని బ్లెస్ చేస్తున్నారు..
also read:Kantara chapter 1: 2 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి.. జోరు మామూలుగా లేదుగా?
బిగ్ బాస్ షో తో మరింత పాపులారిటీ..
శోభా శెట్టి కార్తీకదీపం సీరియల్ తో వచ్చిన ఫేమ్ తో తెలుగు బుల్లితెర రియాల్టీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా అవకాశం అందుకుంది. అలా బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో ఒకింత నెగెటివిటీని మూట కట్టుకుంది. సీరియల్ లోనే కాదు బయట కూడా శోభా శెట్టి విలనే అంటూ చాలామంది ఈమె ప్రవర్తనపై మండిపడ్డారు. కానీ బిగ్ బాస్ ద్వారా మాత్రం మరింత ఫేమస్ అయింది.అయితే అలాంటి శోభా శెట్టి తాజాగా బిజినెస్ రంగంలోకి అడుగు పెడుతుందంటే ఆమె కెరియర్లో ఓ మెట్టు ఎక్కినట్టే అంటున్నారు ఈ విషయం తెలిసిన ఆమె సన్నిహితులు.
శోభా శెట్టి వ్యక్తిగత జీవితం..
శోభ శెట్టి పర్సనల్ లైఫ్ కి..వస్తే ఆమె సీరియల్ నటుడు అయినటువంటి యశ్వంత్ రెడ్డి ని పెళ్లాడబోతోంది. గత ఏడాది వీరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. యశ్వంత్ రెడ్డి ఎవరో కాదు కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు తమ్ముడు ఆదిత్య పాత్రలో యశ్వంత్ రెడ్డి నటించారు.. అలా ఈ సీరియల్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త యశ్వంత్ రెడ్డి,శోభా శెట్టిలను పెళ్లి వరకు తీసుకెళ్లబోతోంది.