BigTV English

Jitan Ram Manjhi: కూలుతున్న వంతెనపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు !

Jitan Ram Manjhi: కూలుతున్న వంతెనపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు !

Jitan Ram Manjhi: బిహార్‌లో కుప్పకూలుతున్న వంతెనలపై కేంద్ర మంత్రి జితిన్ రాం మాంఝీ కీలక వ్యాఖ్యలు చేశారు. వరుసగా వంతెనలు కూలుతున్న ఘటనలపై ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. వంతెనల నిర్మాణంలో ఏమైనా అవకతవకలు జరిగితే చర్యలు చేపట్టి పరిస్థితి చక్కదిద్దుతామని అన్నారు. వరుస ఘటనల నేపథ్యంలో బిహార్‌లోని వంతెనలను ప్రభుత్వం ముందస్తుగా పరిశీలిస్తోందని వెల్లడించారు.


మరమ్మతులు సహా బ్రిడ్జి నిర్మాణంలో లోపాలు తలెత్తితే వాటిని సరిదిద్దుకునే చర్యలు చేపడతామని చెప్పారు. ఇటీవల వంతెనలు పేకమేడల్లాగా కూలుతున్నాయి. గత కొద్ది రోజుల్లో ఏకంగా 12 వంతెనలు కుప్పకూలాయి. వంతెనలు కూలుతుండటంతో బిహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 15 మంది ఇంజనీర్లు సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రబుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరో వైపు నిర్మాణంలో ఉన్న వంతెనలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. నిర్మాణ వ్యయాన్ని దోషులుగా గుర్తించిన కాంట్రాకటర్లపై విధించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. వరుసగా వంతెనలు కూలుతున్న ఘటనపై ఎన్టీఏ సర్కార్ లక్ష్యంగా విపక్ష కూటమి విమర్శలు చేస్తోంది. మోదీ సర్కార్ హయాంలో విమానాశ్రయాల్లో పై కప్పులు విరగడం, వంతెనలు కుప్పకూలడం మినహా అభివృద్ధి మచ్చుకైనా కనిపించదని ఆరోపిస్తున్నారు.


ఇదిలా ఉంటే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి డెహ్రాడూన్ కూలిపోయింది. కొండ ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మిస్తున్న సిగ్నేచర్ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. బీజేపీ పాలిత ఉత్తరా ఖండ్ సంఘటన జరిగింది. రాష్ట్రంలో తొలి సిగ్నేచర్ బ్రిడ్జిను బద్రీనాథ్ హైవేపై నార్కోటిక్స్ నిర్మిస్తున్నారు. రూ. 76 కోట్ల వ్యయంతో ఆర్‌సీసీ డెవలపర్స్ ఈ వంతెనను పెద్ద ఎత్తున నిర్మిస్తోంది. కాగా గురువారం నిర్మాణంలో ఉన్న ఈ వంతెన కూలింది. అయితే పునాది చెక్కుచెదరలేదని టవర్ మాత్రమే కూలిందని అధికారులు తెలిపారు.

Also Read:  నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మరో కొత్త కోణం

సాంకేతిక కమిటీ, ఎక్కడ లోపం జరిగిందో గుర్తిస్తుందని చెప్పారు. రోజూ 45 మంది కార్మికులు నిర్మాణంలో పని చేస్తారని మరో అధికారి తెలిపారు. అయితే గురువారం ఈ వంతెనపై ఎవరూ పనిచేయలేదని దీంతో ఎవరికి నష్టం జరగలేదని అన్నారు. ఇదిలా ఉంటే నాసిరకంగా, నిర్లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. హైవే అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శిస్తున్నారు. దేశంలోని పలుచోట్ల బ్రిడ్జిలు కూలుతుండటంతో బీజేపీ సర్కార్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags

Related News

Minta Devi Bihar: పార్లమెంట్ లో రచ్చరేగిన..124 ఏళ్ల ఓటరు ఎక్కడ?.. ఆమె మాట ఇదే!

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Big Stories

×