BigTV English

Viral Video: ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. రెప్పపాటులో ఘోరం, ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

Viral Video: ఫోన్ చూస్తూ డ్రైవింగ్.. రెప్పపాటులో ఘోరం, ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

Car Accident:

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది. వీటిలో ఎక్కువ ప్రమాదాలకు కారణం నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ముందు వెళ్లే వాహనాలను ఓవర్ టేక్ చేయాలనే ఆలోచన, కొన్నిసార్లు బ్రేకులు ఫెయిల్ లాంటి సమస్యలతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ యువతి సెల్ ఫోన్ చూస్తూ, రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తూ ఘోర ప్రమాదానికి కారణం అయ్యింది. అయితే, ఈ ఘటనలో కారు డ్యామేజ్ కాగా, ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..  

ఓ యువతి ఆఫీస్ నుంచి కారులో ఇంటికి ఇంటికి వెళ్తుంది. రహదారి మీద సుమారు 60 కిలో మీటర్ల వేగంతో కారు ప్రయాణిస్తుంది. సదరు యువతి డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టకుండా సెల్ ఫోన్ లో ఎవరికో మెసేజ్ లు పంపుతుంది. ఆమె వెళ్లే రోడ్డు కూడా చాలా ఇరుకుగా ఉంది. అయినా, పట్టించుకోకుండా అలాగే సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేసింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆమె స్టీరింగ్ మీది నుంచి రెండు చేతులు తీసి, సెల్ ఫోన్ లో మెసేజ్ టైప్ చేయడం మొదలు పెట్టింది. కారు వేగం ఇంచుమించు 70 కిలో మీటర్లకు చేరింది. ఆమె సెల్ ఫోన్ మీద ఫోకస్ పెట్టడంతో కారు ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఆమె అలర్ట్ అయి కంట్రోల్ చేసే లోగా రోడ్డు పక్కన నాటిన రోడ్ సేఫ్టీ బోర్డులను తగులుతూ ముందుకు వెళ్లింది. అప్పటికే కారు ముందు భాగం డ్యామేజ్ అయ్యింది. ఒక్కసారిగా ఈ ఘటనతో షాకైన యువతి బిగ్గరగా అరిచింది. టైమ్ బాగుండటంతో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ఇక ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ అన్నీ కారులోని కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సదరు వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెల్ ఫోన్ ఫోన్ చూడాలనిపిస్తే, అంతగా అవసరం అనుకుంటే కారు పక్కన ఆపి చూసుకోవాలే తప్ప, ఇలా రోడ్డు మీద స్టీరింగ్ వదిలేసి రెండు చేతులతో మెసేజ్ లు చేయకూడదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవిడే తప్పు చేసే, ఎవరో వచ్చి ఆమె కారుకు యాక్సిడెంట్ చేసినట్లు అరవడం ఏంటో అర్థం కావట్లేదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఈ రోజుల్లో చాలా మంది డ్రైవర్లు ఈమె లాగే డ్రైవింగ్ చేస్తున్నారు. సెల్ ఫోన్ చూస్తూ, డ్రైవింగ్ నిర్లక్ష్యం చేస్తున్నారు. పోలీసులు కూడా సరిగా పట్టించుకోవడం లేదు. కోర్టులు సరైన శిక్షలు విధించడం లేదు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మెసేజ్‌లు పంపడం అనేది తాగి వాహనం నడుపుతున్నదానితో సమానం” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.

Read Also: మీకు మిక్చర్ అంటే బాగా ఇష్టమా? ఆ టేస్ట్‌కు కారణం ఇదే.. తింటే పోవడం పక్కా!

Related News

iPhone Kidney: కిడ్నీ అమ్మేసి మరీ ఐఫోన్ కొన్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో దయనీయ స్థితిలో..

Viral Video: మీకు మిక్చర్ అంటే బాగా ఇష్టమా? ఆ టేస్ట్‌కు కారణం ఇదే.. తింటే పోవడం పక్కా!

Bengaluru Crime: బెడ్ రూమ్‌లో కెమెరా పెట్టి.. విదేశీయులతో ఆ పని చేయాలంటూ భార్యపై భర్త ఒత్తిడి, చివరికి…

Free Fuel: భలే ఆఫర్.. బికినీలో వస్తే పెట్రోల్ ఉచితం, ఆ తర్వాత జరిగింది తెలిస్తే నవ్వు ఆగదు!

Viral News: చెక్కు మీద ప్రిన్సిపల్ రాసింది చూసి.. అంతా అవాక్కు, వీడి చదువు తగలెయ్య!

Nun Garba Dance: ‘నన్’ వేషంలో గర్బా డ్యాన్స్.. నెట్టింట వీడియా వైరల్.. ఇదేం పైత్యమంటూ కామెంట్స్

Watch Video: సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు నుంచి జారిపడ్డ ప్రయాణీకుడు.. కానిస్టేబుల్ చేసిన పనికి అంతా షాక్!

Big Stories

×