E-Paper
Advertisement

Lucky Zodiac Signs: ఒకే రోజు శని సంచారం, సూర్య గ్రహణం.. వీరికి ధనలాభం

Lucky Zodiac Signs: ఒకే రోజు శని సంచారం, సూర్య గ్రహణం.. వీరికి ధనలాభం
Advertisement

Lucky Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని సంచారం, సూర్యగ్రహణం ఈ రెండు సంఘటనలు చాలా ముఖ్యమైనవి. ప్రస్తుతం శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. 2024లో శని రాశి మార్పు చెందదు. రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని తన రాశిని మార్చుకుంటాడు. వచ్చే ఏడాది అంటే 2025లో శని దేవ గురువు బృహస్పతికి చెందిన మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఈ రాశిలో రెండున్నరేళ్లు శని ఉంటాడు. అయితే ఈ శని సంచారం మొత్తం 12 రాశులును కూడా ప్రభావితం చేస్తుంది. 2025 లో శని సంచారం రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడుతోంది. ఏ రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది ? శని సంచారం ఎప్పుడు జరుగుతుంది? వీటి ప్రభావం గ్రహాలపై ఏ విధంగా ఉంటుంది. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

శని సంచారం, సూర్య గ్రహణం ఎప్పుడు ?
శని మార్చి 29, 2025 రోజు రాత్రి 11:10 గంటలకు స్థానం మారబోతున్నాడు. ఈ రోజు శని కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇక్కడ శని మీనరాశులో రెండున్నరేళ్ల పాటు ఉంటాడు. ఇక అదే రోజున కొత్త ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. కానీ దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి రెండున్నర సంవత్సరాల పాటు శనేశ్వరుడు అద్భుతమైన ఫలితాలను అందిస్తాడు. ఆర్థిక లాభాలను, సంతోషమైన జీవితం ఇస్తాడు. ఈ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సింహ రాశి:
సూర్యగ్రహణం రోజున శని సంచారం వల్ల సింహరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సింహ రాశి వారికి అధిపతి సూర్యుడు. శని సంచారం సూర్య గ్రహణం వల్ల ఈ రాశి వారికి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీలో సాహసం కూడా బాగా పెరుగుతుంది. శని ప్రభావం వల్ల మీ జీవితంలో ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు. మీ ఆపీసుల్లో పెద్ద బాధ్యతలను కూడా పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
తులా రాశి:
తులా రాశి వారికి శని సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శనిదేవుడి అనుగ్రహం వల్ల మీరు జీవితంలో సంతోషాలను పొందుతారు. మీ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. మార్చి 2025 తర్వాత మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వం కూడా బాగా మెరుగుపడుతుంది. ఈ కాలం వ్యాపారులకు కూడా బాగా లాభదాయకంగా ఉంటుంది.

Also Read: చతుర్మాసంలో ఈ పనులు చేస్తే కష్టాలు తప్పవు !

Advertisement

మీన రాశి:
వచ్చే ఏడాది మీన రాశిలోనే శని సంచారం ఉండబోతోంది. దీని ప్రభావం వల్ల మీన రాశి వారికి సుఖ సంతోషాలను కలిగుతాయి. ఈ కాలంలో మీరు భౌతిక ఆనందం, సంపదను బాగా పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలు కలుగుతాయి. పెండింగ్‌లో ఉన్న పని పూర్తికావచ్చు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సంపదను పోగు చేసుకోవడంలో కూడా విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×