IND VS WI: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ గెలుచుకున్న టీమిండియా… మరో విజయాన్ని దక్కించుకుంది. వెస్టిండీస్ జట్టుపై తొలి టెస్ట్ మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ కొట్టింది గిల్ సేన. అహ్మదాబాద్ వేదికగా టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ 3 రోజుల కిందట ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్టులో టీమిండియా బ్యాటర్లు అలాగే బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ నేపథ్యంలోనే… వెస్టిండీస్ పై మూడు రోజుల వ్యవధిలోనే మ్యాచ్ ఫినిష్ చేసింది టీం ఇండియా. ఈ మ్యాచ్ లో ఏకంగా 140 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో 1-0 తేడాతో లీడింగ్ సంపాదించింది.
Also Read: Shoaib Malik Divorce: మూడో భార్యకు కూడా షోయబ్ మాలిక్ విడాకులు..? సానియా మీర్జా పాపం తగిలిందా !
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో గిల్ సేన రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్ చేసింది టీమిండియా. మొదటి అలాగే రెండవ ఇన్నింగ్స్ లో అత్యంత దారుణంగా విఫలమైన వెస్టిండీస్.. ఓడిపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో 162 పరుగులు చేసిన వెస్టిండీస్ రెండవ ఇన్నింగ్స్ లో కేవలం 146 పరుగులకు కుప్పకూలింది.
టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించిన నేపథ్యంలో… 140 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టి ఆల్రౌండర్ ప్రదర్శన కనబరిచాడు. అటు కుల్దీప్ యాదవ్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ పడగొట్టాడు. మొదటి టెస్ట్ గెలిచిన టీమిండియా.. ఈ సిరీస్ లో లీడింగ్ లోకి వచ్చింది. అటు టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు ఢిల్లీలోని అరుణ్ జెట్లీ వేదికగా జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10వ తేదీన నిర్వహించనున్నారు.
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ( Ravindra Jadeja ) సరికొత్త రికార్డు. ప్రతి మ్యాచ్లో అద్భుతంగా రాణిస్తున్న రవీంద్ర జడేజా…. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోవడంలో కూడా కొత్త రికార్డు సృష్టించాడు. తన టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 11 అవార్డులు దక్కించుకున్నాడు రవీంద్ర జడేజా. అలాగే 3390 పరుగులు చేయగా 334 వికెట్లు కూడా తీశాడు. అయితే అత్యధికంగా టెస్టుల్లో… సచిన్ టెండూల్కర్ ( Sachin tendulkhar ) 14 అవార్డులు అందుకున్నాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా ఆ వరుసలో నిలిచాడు. రాహుల్ ద్రవిడ్ నిన్నటి వరకు 11 అవార్డులతో రెండవ స్థానంలో… ఆస్థానాన్ని రవీంద్ర జడేజా కైవసం చేసుకున్నాడు. టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్రౌండర్ అంటే ఇలా ఉంటుందని.. తన గణాంకాలతోనే స్పష్టం చేశాడు.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
KL Rahul has been really solid in Slips 👌 pic.twitter.com/S7MRMEI5qz
— Johns. (@CricCrazyJohns) October 4, 2025