Auto Driver Sevalo Scheme: ఇవాళ ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం కానుంది. విజయవాడలో సీఎం చంద్రబాబు పథకం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి సింగ్ నగర్ వరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్, ఆటోలో ప్రయాణించారు. పథకం క్రింద ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల ఇవ్వనుంది ప్రభుత్వం. 2.90 లక్షల మందికి రూ.436 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక గత ప్రభుత్వంకంటే 30 వేల మంది అదనంగా పథకం క్రింద లబ్ధి పొందనున్నారు. ఎన్నికల మానిఫెస్టేలో ప్రకటించకపోయిన.. ఆటో డ్రైవర్లకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం.
ఆటో డ్రైవర్ సేవల పేరుతో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం.. ప్రత్యేక ఆర్థిక సాయం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభోత్సవం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డీ. మాధవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆటోలో సీఎం, పవన్, లోకేశ్
ఈ రోజు ఉదయం ఉండవల్లిలోనే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముగ్గురూ ఆటోల్లో ప్రయాణిస్తూ ప్రజల మధ్యకి వచ్చారు.
వీరి ఆటో ర్యాలీ ప్రకాశం బ్యారేజ్ నుంచి సింగ్ నగర్ దాకా సాగింది. మార్గమధ్యంలో ప్రజలు, ఆటో డ్రైవర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో వీరిని ఆత్మీయంగా స్వాగతించాయి. మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలో వీరికి మంగళగిరి చేనేత కండువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. బాణాసంచా, తీన్ మార్ డప్పుల మోతలతో యువత, డ్రైవర్లు సందడి చేశారు.
ఆటో డ్రైవర్‌లకు రూ.15 వేల సాయం
ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద ప్రభుత్వం.. ఒక్కో డ్రైవర్‌కు ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. మొత్తం 2,90,669 మంది లబ్ధిదారులకు రూ.436 కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది.
వీరిలో
2.64 లక్షల మంది ఆటో డ్రైవర్‌లు,
20,072 మంది ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్‌లు,
6,400 మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్‌లు ఉన్నారు.
గత ప్రభుత్వ కాలంతో పోలిస్తే ఈసారి 30,000 మందికి పైగా అదనంగా లబ్ధి పొందనున్నారు.
మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సమతుల్యం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో.. ఆటో డ్రైవర్ల ఆదాయం కొంత మేర తగ్గిన నేపథ్యంలో, వారిని ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు.
Also Read: అమెరికాలో అంగరంగ వైభవంగా.. అంబటి రాంబాబు కూతురు పెళ్లి, రిసెప్షన్ ఎక్కడ?
విజయవాడలో ఉత్సాహ వాతావరణం
సింగ్ నగర్‌లోని బసవపున్నయ్య స్టేడియం ప్రజాసమూహంతో నిండిపోయింది. ఆటో డ్రైవర్‌లు తమ వాహనాలపై పూలతో అలంకరించి ర్యాలీగా పాల్గొన్నారు. పథకం ప్రారంభం సందర్భంగా అక్కడి వాతావరణం పండుగలా మారింది.