Big Stories

Shivratri : శివరాత్రి రోజు చేయకూడని పనులు

Shivratri

Shivratri : శివరాత్రి మర్నాడు శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం దానం చేయాలి. లింగోద్భవం జరిగిన అర్థరాత్రి రోజూ వస్తుంది కాబట్టి ప్రతిరోజూ శివరాత్రే… ప్రతి క్షణం శివస్మరణ యోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి నెలా వచ్చే రోజును మాస శివరాత్రి అన్నారు. అందుకే ఆ రోజున మహా శివరాత్రి పర్వదినంగా జరుపుకొంటారు. మహా శివరాత్రి రోజున ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. అలా కాకపోతే, ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి

- Advertisement -

ముఖ్యంగా ఆ పరమేశ్వరుడికి నైవేధ్యంగా పంచామృతాన్ని పెట్టాలని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేసి శివుడిని పూజించాలి. శివరాత్రి మహా పర్వదినాన దాన ధర్మాలు చేయాలి. పేదలకు అన్న దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయట. ముఖ్యంగా శివుడికి స్వచ్ఛమైన నీళ్లతో అభిషేకం చేయాలని పురాణాలు చెబతున్నాయి. శివరాత్రి రోజు శివలింగాన్ని పూజించేటప్పుడు గానీ అభిషేకించేటప్పుడు గానీ పొరపాటున కూడా తులసి ఆకులను ఉపయోగించకూడదు.

- Advertisement -

శివరాత్రి పర్వదినాన శివలింగాన్ని అభిషేకించేటప్పుడు పొరపాటున కూడా ప్యాకెట్ పాలను ఉపయోగించడకూడదట. దేవుడి అభిషేకానికి ఆవు పాలు మంచివని గుర్తించుకోవాలి. ఉపవాస, జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మర్నాడు శివభక్తులకు అన్నదానం చేయాలని వ్రత విధానన్ని పార్వతికి ఆదిదేవుడు బోధించాడు. ఇవేమీ చేయలేని వాళ్లు అనుకున్నవారు అత్యంత భక్తి, శ్రద్ధలతో నిరంతరం శివనామాన్ని మనసులో ధ్యానం చేస్తూ, రాత్రిపూటైనా దేవాలయంకు వెళ్లడం, శివకళ్యాణం చూడటం చేయండి.

శివరాత్రి పర్వదినాన శివలింగాన్ని అభిషేకించేటప్పుడు పొరపాటున కూడా ప్యాకెట్ పాలను ఉపయోగించడకూడదట. దేవుడి అభిషేకానికి ఆవు పాలు మంచివని గుర్తించుకోవాలి. మహాశివరాత్రి రోజు రాత్రి శివాలయంలో దీపాన్ని వెలిగించండి. శివపురాణం ప్రకారం కుబేరుడు తన గత జన్మలో శివలింగం వద్ద వెలుగొందాడు అందుకే ఆయన తర్వాతి జన్మలో దేవతల కోశాధికారిగా మారాడు.

ఇదే విధంగా మీరు శివలింగం వద్ద దీపం వెలిగిస్తే మీరు ఆర్థిక ఫలితాలు అందుకుంటారు. అంతేకాకుండా మీకు డబ్బు కొరత అస్సలు రాదు. శివుడు అనుగ్రహం పొంది సుఖ-సంతోషాలతో జీవిస్తారు.ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పదోన్నతులు, పురోగతి సాధిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News