Big Stories

Sir Movie : ట్విటర్ రివ్యూ..సార్ పాఠాలు ప్రేక్షకులకు నచ్చాయా..?

Sir Movie :ధనుష్ లెక్చరర్ పాత్రలో నటించిన తాజా చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి సార్ పాఠాలు ప్రేక్షకులకు నచ్చాయా? ఈ సినిమాను ఇప్పటికే చూసిన ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది? సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్లు చేస్తున్నారు? ఈ విషయాలు తెలుసుకుందాం..

- Advertisement -

హార్ట్ టచింగ్..
సార్ కథలో ట్విస్టులు బాగున్నాయని సోషల్ మీడియా టాక్. బయోలజీ లెక్చరర్ పాత్రలో సంయుక్త మీనన్ ఆకట్టుకుందని చెబుతున్నారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు చేసే త్యాగాలను చాలా ఎమోషనల్ గా చూపించారని.. ఈ సన్నివేశాలు చాలా కనెక్ట్ అయ్యాయని నెటిజన్లు అంటున్నారు. ఫస్టాఫ్‌ చాలా హార్ట్ టచింగ్ గా ఉందని ట్విటర్ లో కామెంట్లు చేస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాలపై కార్పొరేట్ కళాశాలల ప్రభావాన్ని ఈ మూవీలో బాగా చూపించారని చెబుతున్నారు.

- Advertisement -

వన్ మ్యాన్ షో..
ధనుష్ ఫెర్ఫార్మెన్స్ అదిరిపోందని ప్రేక్షకులు అంటున్నారు. విద్యార్థులను మోటివేట్ చేసే సన్నివేశాలు ఎంతో స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్నాయని చెబుతున్నారు. సార్ సినిమాను తన భుజాలపైనే ధనుష్ మోసాడని టాక్ వినిపిస్తోంది. ప్రతి సన్నివేశంలోనూ తన మార్క్ నటనతో మెప్పించాడని ట్విటర్ టాక్. సుమంత్ భావోద్వేగమైన పాత్రతో మెప్పించాడని అంటున్నారు. సాయికుమార్, తనికెళ్ల భరణి తమ పాత్రలకు న్యాయం చేశారని.. హైపర్ ఆది కడుపుబ్బా నవ్వించాడని చెబుతున్నారు. జీవీ ప్రకాశ్ అందించిన సంగీతం సార్ సినిమాకు అదనపు బలంగా నిలిచిందంటున్నారు.

సార్ మెప్పించారా.?
కార్పొరేట్ కళాశాలలు సాగించే అక్రమ దందాలు, మాఫియా కార్యక్రమాలపై సంధించిన విమర్శనాస్త్రమే సార్. ర్యాంకుల కోసం సాగించే అవినీతి కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో కులం, వివక్ష అంశాలను తెరపై చక్కగా చూపించారనేది సినిమా చూసిన ప్రేక్షకుల విశ్లేషణ. నాగరిక ప్రపంచంలోని వ్యత్యాసాలను ఎండగడుతూ విద్య ప్రాముఖ్యతను చాటిచెప్పే చక్కటి సందేశాన్ని అందించిన చిత్రంగా సార్ నిలుస్తోందని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News