
Cows Milk : గోవు దేవతా స్వరూపము. కైలాసం దగ్గరలోని గోలోకము నుండి వచ్చినది.గోవుల కంఠంలోను, పొదుగులోనూ, మూత్రములోను గంగాదేవి ఉంది. శిరస్సు, గంగడోలు, కళ్లు, చెవులు, తోక,కాళ్లు, మొదలైన ఆవు సర్వ అవయవాల్లోనూ సర్వదేవతలు ఉంటారని హిందూవులక ప్రగాఢ నమ్మకం. కొన్ని నివారణ లేని రోగాలకు గోమూత్రాన్ని ఔషధంగా కూడా త్రాగుతారు. గోవు మలమూత్రాలలో పెన్సిలిన్ ఉందని కనుగొన్నారు. గోవు నోటి నుంచి వచ్చే నురుగను ఎంతకీ తగ్గని ప్రణాల మీద రాస్తూ ఉంటే ఎంతటి పుండు అయినా మానిపోతుందట.ఆవుపాలు సర్వరోగ నివారణి. ఆవు పాలు వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతాయి.
అందుకే గోవును గోమాత హిందువుల గౌరవపూర్వకంగా పిలుస్తారు. ప్రతీ పూజకూ ఆవు పాలే కావాలా అంటే వైదిక ధర్మం కావాలని చెబుతోంది. ప్రతీదేవుని పూజకు ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడవిధిగా కావాలని పురోహితులు చెబుతారు. పాల ప్యాకేట్లు జనానికి అలవాటయ్యాక చాలా మంది ఆవులను పెంచడం మానేశారు. ఏ ఇంటి ముందు గోమాత ఉంటుందో ఆ ఇంట్లో సర్వ శుభాలు ఉంటాయి. ఆవు పాలు కావాలంటే నగరాలు, పట్టణాల్లో దొరకడం కష్టమే.
భారతీయ జన జీవితంలో గోవు జతపడి ఉంది . ఏపూజలోనైనా గో క్షీరంతో దైవాభిషేకం చేయాల్సిందే. భారతీయ గోవులకు మూపురము ఉంటుంది.
ఈ మూపురములోని వెన్ను పూసకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి ఉంది. అందువలన ఈ ఆవుపాలు, నెయ్యి, వెన్నలకు పైన చెప్పిన ప్రత్యేక గుణములున్నవి.
పాశ్యాత్య దేశాల గోవులైన జర్సీ, హె.యఫ్ వంటి గోవులకు మూపురము ఉండదు. అవి సూర్యశక్తిని గ్రహించలేవు. అందువలన వీటి పాలు మంచివి కావు.
మహాభారత కథలో ద్రోణునికీ, ద్రుపదునికీ గోవు వల్లే గొడవ వచ్చింది. ఒక్క ఆవు కోసం మొదలైన వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి ద్రుపదద్రోణుల మరణానికి కారణమైంది. విష్ణుమూర్తికి గోవులంటే ఇష్టం. అందుకే గోవిందుడు, గోపాలుడు అంటారు. గోవులు ఉండే చోట శనీశ్వరుడు ఉండడు. .ఆవు పాలతో పూజలు చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. గోదానం కూడా గొప్పది
ఆవుపాలను అమృతంగా భావిస్తారు. పూర్వకాలంలో ఎక్కువగా ఆవుపాలనే తాగే వారు. ఆవుపాలు తాగి పెరిగిన వారిలో తెలివి తేటలు ఎక్కువ ఉంటాయట. గేదె పాలలో ఉన్నంత కొవ్వు ఆవు పాలలో ఉండదు. కాబట్టి పసి పిల్లలకు ఆవు పాలు సర్వశ్రేష్టం. కార్తీక పురాణములో- ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని చెప్పారు. ఆవుపాలు, ఆవు నెయ్యితో మనకు దేవతాశక్తి వస్తుంది.