E-Paper
Advertisement

AA22× A6: అల్లు అర్జున్ సినిమా కోసం హాలీవుడ్ మార్కెటింగ్ హౌస్.. ఆస్కార్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారే ?

AA22× A6: అల్లు అర్జున్ సినిమా కోసం హాలీవుడ్ మార్కెటింగ్ హౌస్.. ఆస్కార్ కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారే ?
Advertisement

AA22× A6: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు అల్లు అర్జున్(Allu Arjun). తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయనకు పుష్ప సినిమా(Pushpa) ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ హీరోగా సక్సెస్ అందుకున్న ఈయన త్వరలో రాబోయే అట్లీ(Atlee) సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో తన స్టామినా ఏంటో నిరూపించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది . కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ప్రస్తుతం అల్లు అర్జున్ తన తదుపరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇండియాకి వచ్చిన హాలీవుడ్ మార్కెటింగ్ పవర్ హౌస్..

Advertisement

ఇక ఈ సినిమా నేషనల్ లెవెల్ లో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ లో విడుదల చేయాలని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే గ్లోబల్ స్థాయిలో మార్కెటింగ్ కోసం సన్నాహాలు కూడా సిద్ధం చేస్తున్నారు. హాలీవుడ్ కు చెందిన ప్రముఖ మార్కెటింగ్ పవర్ హౌస్ ఎగ్జిక్యూటివ్ మొదటిసారి ఇండియాకు రావడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. హాలీవుడ్ మార్కెటింగ్ ఏజెన్సీ కనెక్ట్మోబాసెన్స్ క్రియేటివ్ కంటెంట్ అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మొదటిసారి ఇండియా పర్యటనకు వచ్చారు.

ఆస్కార్ అవార్డును టార్గెట్ చేశారా?

Advertisement

ఈ విధంగా హాలీవుడ్ మార్కెటింగ్ పవర్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ఇండియాకు రావడంతో కచ్చితంగా అల్లు అర్జున్ సినిమా కోసమే వచ్చారనే వార్తలు తెరపైకి వచ్చాయి. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాని హాలీవుడ్ స్థాయిలో ప్రమోషన్లను నిర్వహిస్తూ ఆస్కార్ అవార్డు (Oscar Award)పొందటమే లక్ష్యంగా పనిచేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే హాలీవుడ్ మార్కెటింగ్ పవర్ హౌస్ అల్లు అర్జున్ అట్లీ సినిమా కోసమే ఇండియా సందర్శించారా? లేక ఈ పర్యటన వెనక మరేదైనా కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉంది.

ఈసారి ఇంటర్నేషనల్.. తగ్గేది లే…

పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ హిట్ కొట్టిన బన్నీ ఈసారి మాత్రం ఆస్కార్ అవార్డును టార్గెట్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ లో సినిమాని ప్లాన్ చేయబోతున్నారని స్పష్టమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్గా నటించగా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక వంటి హీరోయిన్లు నటించబోతున్నారు. అయితే మొదటిసారి రష్మిక ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. పుష్ప సినిమా ద్వారా ఈ ఇద్దరు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్నారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ కు రష్మిక విలన్ గా కనిపించబోతున్నారనే వార్త బయటకు రావడంతోనే సినిమాపై మంచి అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పనిచేయబోతున్నారని తెలుస్తోంది.

Also Read: Rajinikanth: బాలీవుడ్ లో సత్తా చాటిన తలైవా.. రెండో సినిమాగా కూలీ రికార్డ్!

Related News

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×