Avneet Kaur Kohli : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతను ప్రస్తుతం వన్డేల్లో టాప్ క్రీడాకారుడిగా రాణిస్తున్నాడు. టెస్ట్, టీ-20 క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా హీరోయిన్ అవ్నీత్ కౌర్ విరాట్ కోహ్లీ గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే..? అవ్నీత్ కౌర్ తన తాజా చిత్రం లవ్ ఇన్ వియత్నాం.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈమెకు విరాట్ కోహ్లీ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి స్పందిస్తూ.. కోహ్లీ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. విరాట్..” ప్రేమ వస్తూనే ఉండాలి” అని పేర్కొన్నాడని తెలిపింది.
Also Read : Dream11 – My11Circle : మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. డ్రీమ్ 11, మై సర్కిల్ 11 కు ఎన్ని కోట్ల నష్టం అంటే
ముఖ్యంగా ఏప్రిల్ 30న ఇన్‌స్టాగ్రామ్‌లో అవ్నీత్ వరుస చిత్రాలను షేర్ చేయడంతో వివాదం మొదలైంది. ఆమె ప్రింటెడ్ ర్యాప్ స్కర్ట్‌తో ఆకుపచ్చ క్రాప్ టాప్ ధరించింది. ఆన్‌లైన్‌లో దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే..? విరాట్ కోహ్లి పోస్ట్‌ను లైక్ చేసాడు. ఇక వెంటనే దాన్ని అన్‌లైక్ చేశాడు. ఈ పేజీని అభిమానులు గమనించారు.
“కోహ్లీ సాబ్ ఈ ప్రవర్తన ఏమిటి?” మరో వినియోగదారు “అకాయ్ బేటా పాపా కో ఫోన్ దో” అని చమత్కరించారు. ఇక స్క్రీన్‌షాట్‌లు వైరల్ కావడంతో, విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అతను ఇలా వ్రాశాడు, “నా ఫీడ్‌ను క్లియర్ చేస్తున్నప్పుడు, అల్గోరిథం పొరపాటున పరస్పర చర్యను నమోదు చేసిందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. దాని వెనుక ఎటువంటి ఉద్దేశం లేదు. అనవసరమైన ఊహలు చేయవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. మీ అవగాహనకు ధన్యవాదాలు అని తెలిపారు.
యాక్సిడెంటల్ గా అంటూ..
సోషల్ మీడియా కబుర్ల మధ్య విరాట్-అవ్నీత్ వీరిద్దరూ సెర్బియా టెన్నీస్ స్టార్ నోవాక్ జాకోవిచ్, ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ డి మినార్ మధ్య జరిగిన వింబుల్డన్ 2025 మ్యాచ్ కి హాజరయ్యారు. విరాట్.. జాకోవిచ్ ఫొటోను పంచుకున్నాడు. వాట్ ఏ మ్యాచ్.. గ్లాడియేటర్ కి ఇది సాధారణ వ్యాపారం. అవ్నీత్ కూడా తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో అదే పోటీ నుంచి పలు పోస్టులను షేర్ చేసింది. దీంతో వీరిద్దరూ యాక్సిడెంటల్ గా ఒకే రకంగా ఫొటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి సంభాషణకి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. వీరికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ కి యాక్సిడెంటల్ అయిన ఫొటోలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అవ్నీత్ కౌర్ స్పందించింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.