Mumbai Local Train Love: ఢిల్లీ మెట్రో రైలు, ముంబై లోకల్ ట్రైన్లు నిత్యం ఏదో ఒక ఘటనతో వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా సీట్ల కోసం ప్రయాణీకులు పిచ్చి పిచ్చిగా కొట్టుకునే సన్నివేశాలు ఇక్కడ అత్యంత కామన్. ఇక ప్రేమ జంటల సరససల్లాపాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. పక్కన ప్రయాణీకులు ఉన్నారు. చూస్తే ఏమనుకుంటారో? అనే ఆలోచనే లేదు. రైల్లో తామిద్దరమే ఉన్నామని ఊహించుకుంటూ ఏవేవో పనులు చేసేస్తుంటారు. ఇలాంటి కథలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
ముంబై లోకల్ ట్రైన్ లో ప్రేమ పక్షుల సరసాలు
ఇక ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో ముంబై లోకల్ రైలులో ఓ యువకుడు, ఓ యువతి సరసాల్లో మునిగిపోయారు. యువతి ఒడిలో తలపెట్టి, ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఏవో చిలిపి పనులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోను ఓ తోటి ప్రయాణీకుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. “ఈ సంఘటన ఆదివారం సాయంత్రం 7 గంటల AC అంధేరి-విరార్ లోకల్‌లో జరిగింది. ఈ జంట బోరివాలి స్టేషన్‌కు రాత్రి 7.15 గంటలకు చేరుకోవాల్సిన కోచ్ నంబర్ 8002B2లో కనిపించారు. ఆ వ్యక్తి AC రైలు కోచ్‌లో మహిళ ఒడిలో తల పెట్టి, రెండు చేతులు పట్టుకుని హాయిగా పడుకున్నట్లు కనిపిస్తోంది” అని సుదర్శన్ అనే నెటిజన్ పోస్టు చేశాడు. ఈ ఫోటో కాసేపట్లోనే తెగ వైరల్ అయ్యింది. ఈ ఫోటో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Just pickedup AC 7 PM Andheri to Virar local & one couple is making love in coach no 8002B2
It will reach to Boriwali station by 7.15 PM @WesternRly @RailwaySeva @RailMadad pic.twitter.com/J3QfBahlxI— Sudarshan M (@sud9371219036) August 24, 2025
Read Also: రైల్వే స్టేషన్లలో టికెట్ల అమ్మకం బంద్.. అసలు విషయం చెప్పిన కేంద్రం!
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఈ ఘటనకు సంబంధంచి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి చేష్టల వల్లే ఢిల్లీ మెట్రో పరువు గంగలో కలిసిందని, ఇప్పుడు ముంబై లోకల్ ట్రైన్ల ప్రతిష్ట కూడా దిగజారే అవకాశం ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల రైల్వే పోలీసులు సీరియస్ గా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాళ్లను చూసి చూడనట్లు వదిలేస్తే మరింత మంది అదే బాటలో పయనించే అవకాశం ఉందంటున్నారు. “బ్రదర్ మీ లాంటి ప్రేమికులకు రైలు కంటే పార్క్ లో పొదలు బెస్ట్” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “ఆహా ఏసీలో ప్రేమాయణం ఎంత అద్భుతమో. మీరు కంటిన్యూ చేయడం లవ్ బర్డ్స్” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో వెళ్తున్నప్పుడు కాస్త మర్యాదగా వ్యవహరించాలి. ఇలాంటి పనుల వల్ల వారికే కాదు, రైల్వే నెట్ వర్క్ మొత్తానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంటుందని” అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ముంబై రైల్వే నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
Read Also: నో వాటర్, డర్టీ టాయిలెట్స్, బాబోయ్ రైళ్లలో శుభ్రత ఇంత దారుణమా?