BigTV English

Lord Ganesha: మనిషి రూపంలో దర్శనం ఇచ్చే గణపతి – ఆలయ విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు

Lord Ganesha: మనిషి రూపంలో దర్శనం ఇచ్చే గణపతి – ఆలయ విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు

Lord Ganesha: నరరూప రాక్షసుడు అనే పేరు మీరు వినే ఉంటారు. కానీ నరరూప గణపతి అన్న పేరు ఎప్పుడైనా విన్నారా..? అసలు నరుడి రూపంలో గణపతి ఉండటమేంటని ఆలోచిస్తున్నారా..?  ఆ పేరు వినడానికే ఆశ్చర్యంగా ఉందనుకుంటున్నారు కదా..? కానీ నరుడి రూపంలో ఉన్న గణపతి ఆలయం ఉంది. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా ఇలాంటి ఆలయం లేదని అక్కడి భక్తులు చెప్తున్నారు. ఎంతో పవర్‌ఫుల్‌ అయిన అక్కడి  వినాయకుడి గురించి భక్తులు ఎన్నో రకాలుగా చెప్తున్నారు. అయితే  నరుడి రూపంలో పూజలందుకుంటున్న వినాయకుడి ఆలయం ఎక్కడ ఉంది. ఆ ఆలయ విశిష్టత ఏంటి..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.


నరుడి రూపంలో కొలువైన వినాయకుడు అక్కడి ప్రజల చేత పూజలందుకుంటున్నాడు. ఒక్క పూజలేంటి.. ఆ గుడికి వచ్చే వందలాది భక్తులు ఆ గణపతికి భక్తితో పూజలు, వ్రతాలు చేస్తున్నారట. వాళ్ల నమ్మకానికి అనుగుణంగానే అక్కడి నరరూప గణపతి కూడా వారి భక్తికి మెచ్చి కోరిన వరాలిస్తూ కొంగు బంగారంలా నిలుస్తున్నాడట. ఇంతకీ నరుడి రూపంలోని గణపతి ఎక్కడున్నాడు..? ఆయన కొలువైన ఆలయ విశేషం ఏంటి..? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఏ ఆలయంలోనైనా వినాయుడు ఏనుగు ముఖంతో కనిపిస్తుంటాడు. కానీ అక్కడి ఆలయంలో మాత్రం మానవ రూపంలో దర్శనమిస్తాడు గణపతి. ఇక ఎవరికైనా గణపతి అనగానే  టక్కున గుర్తుకొచ్చే రూపం ఏనుగు తొండం. పెద్దగా ఉన్న బొజ్జ, ఆసక్తికరమైన రూపం.. చిన్న పిల్లలను భక్తితత్వంతో ఆకర్షించే దివ్యమైన ఆకారం. ఇవే ఎవరైనా చెప్పేవి కూడా కానీ అక్కడకొలువైన గణనాథుడు  మాత్రం సాధారణ మనిషి రూపంలో దర్శనం ఇస్తాడు. అందరు దేవీ దేవతల మాదిరిగానే.. విగ్రహ రూపంలో కొలువై ఉన్నాడు. ఎంతో శక్తివంతమైన గణపతిగా భక్తుల కొంగుబంగారంలా.. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పులా పూజలందుకుంటున్నాడు.


ఇలా మనిషి రూపంలో దర్శనం ఇస్తున్న గణపతి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిలతర్పణపురిలో ఉంది. ఇక్కడి ఆది వినాయకర్‌  ఆలయంలోని గణపతి మానవ రూపంలో దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడి వినాయకుడు మనిషి రూపంలో కొలువైఉన్నాడు. దీంతో ఈ ఆలయం లోని  బొజ్జ గణపతి ఏనుగు తల అమర్చక  ముందు ఉన్న రూపం అని భక్తులు నమ్ముతారు. అదే విశ్వాసంతో పూజలు చేస్తుంటారు. ఎంతో మహిమాన్వితమైన ఇక్కడి గణపతి నమ్మి వచ్చిన భక్తులను కరుణిస్తాడని తమకు వచ్చే ఎన్నో ఆటంకాలను తొలగిస్తాడని భక్తులు చెప్తుంటారు.

ఆలయ విశిష్టత: తిలతర్పణపురి అంటే పెద్దలకు తర్పణాలు వదిలే ఆలయం అని అర్థం వస్తుందట. అందుకే ఇక్కడ శ్రీరాముడు తన తండ్రి అయిన ధశరథుడికి పితృకార్యాలు ఇక్కడే నిర్వహించారట. రాముడు పెట్టిన నాలుగు పిండాలు ఇక్కడ నాలుగు శివలింగాలుగా మారాయట. పితృదోషాలతో బాధపడే వారు ఈ ఆలయాన్ని సందర్శించి తర్పణాలు వదిలితే పితృదోషాలు పోతాయట.  అలాగే ఇక్కడి గణపతిని ఇప్పటికీ ఆగస్త్యమహర్షి వచ్చి పూజించి వెళ్తుంటారట.

ఎలా చేరుకోవాలి: తమిళనాడులోని ప్రధాన నగరాల నుంచి ఈ ఆలయానికి బస్సు సౌకర్యాలు ఉన్నాయట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ:  సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం –  అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

 

Related News

Karthika Masam 2025: కార్తీక మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి ?

Bhagavad Gita Shlok: కోపం గురించి భగవద్గీతలో ఏం చెప్పారు ? 5 ముఖ్యమైన శ్లోకాలు..

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. డబ్బే డబ్బు !

Atla Taddi 2025: ఆడపడుచుల పండుగ అట్లతద్ది.. రాకుమారి కథ తెలుసా?

Vastu Tips: ఇంట్లో డబ్బు, బంగారం ఈ దిశలో ఉంచితే.. సంపద రెట్టింపు !

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !

Vastu For Staircase: ఇంటి లోపల.. మెట్లు ఏ దిశలో ఉండాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసం, ఏ రోజు నుంచి ప్రారంభం ? పూర్తి వివరాలివిగో..

Big Stories

×