BigTV English

Flesh Eating Parasite: మనిషి చర్మాన్ని తినేస్తున్న పురుగు.. మీరు అక్కడ ఉంటే జాగ్రత్త బాబోయ్!

Flesh Eating Parasite: మనిషి చర్మాన్ని తినేస్తున్న పురుగు.. మీరు అక్కడ ఉంటే జాగ్రత్త బాబోయ్!

మనిషి కానీ, జంతువు కానీ, ఇతర ఏ జీవులైనా చనిపోయిన తర్వాత పరాన్న జీవులకు ఫలహారంగా మారతాయి. కానీ బతికుండగానే జీవుల్ని పీక్కుతినే క్రిమికీటకాలు చాలా అరుదు. అలాంటి అరుదైన రకం ఈ స్క్రూ వార్మ్. ఇది మనిషిని బతికుండగానే తినేస్తుంది. సరైన చికిత్స తీసుకోకపోతే స్క్రూవార్మ్ మన శరీరాన్నంతా మెల్ల మెల్లగా తినేస్తూ ప్రాణం తీసే వరకు వెంటాడుతుంది. అమెరికాలో ఇటీవల తొలిసారిగా ఇలాంటి కేసుని గుర్తించారు. మేరీల్యాండ్ కి చెందిన ఓ వ్యక్తి గ్వాటెమాలా ద్వారా ప్రయాణించిన తర్వాత అతడిలో ఈ లక్షణాలు కనిపించాయి. అతడిని స్క్రూవార్మ్ తినేస్తున్నట్టు వైద్యులు తెలుసుకున్నారు. చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స మొదలై, దాని ప్రభావం పనిచేయడానికి ముందే స్క్రూ వార్మ్ వేలాది జీవుల్ని పునరుత్పత్తి చేస్తుంది. అవన్నీ కలసి దాడి మొదలు పెడతాయి.


మధ్య అమెరికా, దక్షిణ మెక్సికో..
మాంసాహార పరాన్ని జీవులు సహజంగా జంతువుల్ని పీక్కుతింటాయి. ఇవి మనుషుల్లోకి చొరబడటం అరుదుగా జరుగుతుంది. కానీ అమెరికాలో ఇది బయటపడింది. పశువులు, ఇతర ఉష్ణ రక్త జంతువులపై ఇవి ఆశ్రయాన్ని పొందుతాయి. తమ సంతతిని క్రమక్రమంగా వృద్ధి చేసుకుంటూ, చివరకు ఆ జీవిని అమాంతం భోం చేస్తాయి. గతేడాది చివర్లో మధ్య అమెరికా, దక్షిణ మెక్సికోలో దీని వ్యాప్తి ప్రారంభమైనట్టు తెలుస్తోంది. చికిత్స చేయకుండా అలాగే వదిలేస్తే ఇది చివరికి ప్రాణాంతకంగా మారుతుంది. దక్షిణ డకోటా రాష్ట్ర పశువైద్యురాలు బెత్ థాంప్సన్, గత వారంలో ఈ కేసు బయటపడినట్టు ధృవీకరించారు. మేరీల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ కేసుల్ని ధృవీకరించింది.

అరికట్టాలంటే ఏం చేయాలి?
దీనికి చికిత్సతోపాటు, అసలు ఆ స్క్రూవార్మ్ ఉత్పత్తిని నిర్మూలించడం ఒక్కటే సమస్యకు విరుగుడు అని అంటున్నారు వైద్యులు. ఆడ స్క్రూవార్మ్ ఉష్ణ రక్త జంతువుల గాయాలలో గుడ్లు పెడుతుంది. ఒకసారి ఆ గుడ్లు పొదిగిన తర్వాత, వందలాది స్క్రూవార్మ్ లార్వా బయటకొస్తుంది. అలా ఆ సంతతి వేలు, లక్షలుగా మారి సజీవంగా ఉన్న జంతువు లేదా మానవుడిపై దాడి చేస్తాయి. బతికుండగానే చర్మాన్ని, మాంసాన్ని పీక్కు తింటాయి. ఇప్పటి వరకూ ఇది పశువులు, వన్యప్రాణుల వినాశకారిగా భావించారు. మానవులలో కూడా ఇది తిష్టవేస్తుందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా, మెక్సికోలో మాంసాహార వ్యాపారం దీనివల్ల దెబ్బతింటోంది. దీన్ని నిర్మూలించేందుకు మగ స్క్రూ వార్మ్ లను ప్రయోగశాలలో ఉత్పత్తి చేసి, వాటిని క్రిమి రహితం చేసి, అడవి జాతికి చెందిన ఆడ స్క్రూవార్మ్ తో కలిసేలా చేస్తారు. వాటి కలయిక వల్ల ఉత్పత్తి అయిన స్క్రూవార్మ్ అంత ప్రమాదకరంగా ఉండదు. అంటే.. అడవి జాతి స్క్రూ వార్మ్ పూర్తిగా నశిస్తుంది, తన శక్తిని కోల్పోతుంది. అలా ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ దిశగా ఇప్పుడిప్పుడే ముందడుగు పడుతోంది. ఈ పద్ధతిలోనే 1960లలో అమెరికా స్క్రూవార్మ్‌ను పూర్తిగా నిర్మూలించింది. కానీ ఇప్పుడు మెక్సికో ద్వారా ఇది మళ్లీ వ్యాపిస్తోంది. దీంతో మెక్సికో కూడా స్టెరైల్ స్క్రూవార్మ్ ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.


Related News

Dr. Ganesh Rakh: అక్కడ అమ్మాయి పుడితే ఫ్రీ ట్రీట్మెంట్, నిజంగా గ్రేట్ కదా!

Star Fruit: ఈ ఒక్క ఫ్రూట్ తింటే..షుగర్ కంట్రోల్ అవుతుంది !

Memory: జ్ఞాపకశక్తి పెరగాలంటే.. ఏం చేయాలి ?

Eyesight: కంటి చూపు మెరుగుపరిచే.. చిట్కాలు ఇవిగో !

Stomach Pain: ఇలా చేస్తే.. క్షణాల్లోనే కడుపు నొప్పి మాయం

Big Stories

×