Big Stories

Donations : ఈ వస్తువుల్ని దానం చేయకూడదా…..

Donations : మనిషికి దానగుణం ఉండాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అన్ని మతాలు దానాన్ని చేయమని ప్రబోధిస్తాయి . కష్టాల్లో ఉన్న పేదలకు వీలైనంత సాయం చేయమని అంటారు. కానీ అలా దానం చేసేటేప్పుడు వేటిని చేయాలో, చేయకూడదో తెలుసుకుని చేయాలి . కొన్ని దానాలు మనిషికి ఉచ్చస్థితిని కలిగిస్తే మరికొన్ని అథఃపాతాళానికి పడేస్తాయి

- Advertisement -

దానం చేయకూడనివి:
క‌త్తెర‌లు, క‌త్తులు, సూదులాలంటి ప‌దునైన వ‌స్తువుల‌ను ఎవ‌రూ దానం చేయ‌రాదు. అలా చేసిన వారిని దుర‌దృష్టం వెంటాడుతుంద‌ట‌. ఏది చేసినా అస్స‌లు క‌ల‌సి రాద‌ట‌. ఇలాంటివి దానం చేస్తే దంప‌తుల మ‌ధ్య గొడవులు కలుగతాయి. ఏ ఉద్దేశంతో దానం చేసినా ఫలితం మాత్రం తేడాగా ఉంటుంది. అలాగే వాసన వస్తున్న. పాడైపోయిన ఆహారాన్ని దానంగా భిక్షగాళ్లకి వేస్తుంటారు. అది కూడా మంచిది కాదు. అలా ఇచ్చిన వారుకి మంచి జరగదని శాస్త్రాలు చెబుతున్నాయి. కోర్టు కేసుల‌ు సమస్యల్లో పడతారు. ఉన్న డ‌బ్బు అంతా పోగొట్టుకుంటార‌ట‌. ఏదో రూపంలో ఒకవేళ డ‌బ్బులు వస్తున్నా అవి నిలబడవు

- Advertisement -

పాడైపోయిన బట్టలు
ప‌గిలిపోయిన వ‌స్తువులు, చిరిగిన దుస్తుల‌ను ఎవ‌రికీ దానం ఇవ్వ‌రాదు. అలా చేస్తే అదృష్టం క‌ల‌సి రాద‌ట‌. ఏం చేసినా చెడే జ‌రుగుతుంద‌ట‌. అస‌లు అలాంటి వ‌స్తువుల‌ను ఇంట్లో పెట్టుకోకూడ‌ద‌ట‌. వెంట‌నే పారేయాలి. పనిచేయని వస్తువులు ఇంట్లో నెగిటివన్ ఎనర్జీని తీసుకు వస్తాయి. అలాగే ఇంటి శుభ్రం చేసే చీపుళ్లు లాంటివి కూడా దానానికి పనికి రావు. వాటిని ఇత‌రుల‌కు ఇవ్వకూడదు. అలా ఇచ్చిన వారి ఇంట్లో ల‌క్ష్మి నిల‌వ‌ద‌ట‌. డ‌బ్బు ఇట్టే ఖ‌ర్చ‌వుతుంద‌ట‌. వ‌చ్చినా అస్స‌లు నిల‌వ‌ద‌ట‌. ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను దానంగా కాదు కనీసం వాడుకునేందుకు కూడా ఇవ్వద్దు. అలా ఇచ్చిన వారికి మంచి జ‌ర‌గ‌ద‌ట‌. కెరీర్ ప‌రంగా అన్నీ స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయ‌ట‌. ఈ వ‌స్తువుల‌ను ఎవ‌రూ దానం చేయ‌కుండా ఉంటే మంచిది. లేదంటే స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న వార‌వుతారు.

డబ్బును దానంగా ఇవ్వొచ్చు..కానీ ఎవరికి ఇస్తున్నాం..ఎలాంటి వారికి ఇస్తున్నామో తెలుసుకుని చేయాలి. డబ్బును సాయంత్రం పూట దానంగా ఇవ్వకూడదు. అలా డబ్బుని దానం చేస్తే.. లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుందట. మీకు డబ్బు అవసరం లేదని భావిస్తూ మీకు దూరంగా వెళ్లిపోతుందట. చూపు లేనివారికి నేత్రదానం, చదువుకోవాలనే కోరిక ఉన్నవారికి విద్యాదానం, ప్రమాదాల్లో గాయపడినవారికి రక్తదానం, అవయవదానం ఇలాంటివి చేయచ్చు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News