Big Stories

Snake venom : పాము విషమే ఔషదం.. ఆ వ్యాధుల కోసం..

Snake venom

Snake venom : ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. కానీ ఆ లక్షణాలు అన్ని అందరిపై ఒకేలా ప్రభావం మాత్రం చూపించవు. ఒక్కొక్కరి శరీరాన్ని బట్టి ఒక్కొక్కలా ప్రభావం ఉంటుంది. కొందరికి విషమే ఔషదంగా కూడా పనిచేస్తుంది. అలాగే పాము విషం అనేది మనిషి ప్రాణాలను ముప్పు అని అంటుంటారు. కానీ దాని వల్ల ఔషదాన్ని కూడా తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికే ఇది రుజువయ్యింది కూడా.

- Advertisement -

పాము విషంలో ఉండే పెప్టైడ్స్ ద్వారా మందులు తయారు చేయవచ్చని, దీని ద్వారా న్యూరోలాజికల్ వ్యాధులను అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పార్కిన్సన్, అల్జైమర్స్ వంటి వ్యాధులకు పాము విషమై ఔషదమని అంటున్నారు. న్యూరోజెనరేటివ్ వ్యాధులలో ఎక్కువగా కనిపించేవే పార్కిన్సన్, అల్జైమర్స్. వీటిని అరికట్టడానికి కానీ, తగ్గించడానికి కానీ ఎటువంటి మందులు లేవు. మనిషి మెదడులో జరిగే మార్పులే ఈ వ్యాధులకు దారితీస్తుంది.

- Advertisement -

మొదటిసారి పాము విషంతో ఈ వ్యాధులకు మందులు కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతే కాకుండా క్యాన్సర్, కార్డియో సమస్యలు, కోవిడ్ 19 వంటి వాటితో పాటు మరెన్నో వ్యాధులకు కూడా దీని ద్వారా మందులు కనిపెట్టవచ్చన్నారు. అయితే మరికొందరు మాత్రం ఎంతైనా పాము విషం నుండి తయారు చేసే మందు ప్రమాదకరమని వాదిస్తున్నారు. అందుకే ప్రమాదం కలగని పద్ధతిలో ఈ మందులను తయారు చేయాలని వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

పాము విషం ద్వారా తయారు చేసే డ్రగ్ కొత్త ప్రక్రియతో తయారు చేయబడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే వ్యాధులు మొదటి స్టేజ్‌లో ఉన్నప్పుడు కనిపెడితేనే ఈ మందులు ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయని వారు అన్నారు. ఇప్పటికే అల్జైమర్స్ అనే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఇబ్బంది పెడుతోంది. ఈ పాము విషంతో చేసే ప్రయోగాలు సక్సెస్ అయితే.. వారందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News