Big Stories

Pathaan: ఓటీటీలోకి పఠాన్.. డేట్ ఫిక్స్..

Pathaan: పఠాన్.. షారుఖ్‌ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా. రికార్డుల మీద రికార్డులు సాధించిన మూవీ. బాక్సాఫీస్ బద్దలు కొట్టిన చిత్రం. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన సినిమా.. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయిక. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించింది.

- Advertisement -

అలాగే వసూళ్లను కూడా భారీగానే రాబట్టింది. రూ. 1048.30 కోట్లు వసూల్ చేసి.. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 656కోట్లు.. వరల్డ్ వైడ్‌గా రూ. 393.10 కోట్లను వసూల చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

- Advertisement -

థియేటర్లలో దుమ్మురేపిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. మార్చి 22 నుంచి హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News