Morning Vastu Tips: రోజు శుభప్రదంగా, విజయవంతంగా, సానుకూల శక్తితో కొనసాగాలంటే ప్రారంభం మంచిగా ఉండాలి. ఇందుకోసం చాలా మంది ఉదయం పూట ధ్యానం చేయడం, అరచేతిని చూడటం, దేవుళ్ల చిత్ర పటాలు చూడటం లేదా నీటిని చూడటం వంటివి అలవాటు చేసుకుంటారు. ఇవన్నీ రోజును చక్కగా ప్రారంభించడంలో సహాయపడతాయని నమ్ముతారు.
ఇదిలా ఉంటే.. మీరు ఉదయం నిద్రలేవగానే అస్సలు చూడకూడని కొన్ని వస్తువులు కూడా ఉన్నాయని మీకు తెలుసా? వాస్తు, జ్యోతిష్యం ప్రకారం.. ఇవి శక్తిని ప్రభావితం చేస్తాయి. అంతే కాకుండా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. మరి ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఉదయం వేటిని చూడకుండా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం నిద్ర లేవగానే అస్సలు చూడకూడనివి:
ఆగిపోయిన గడియారం:
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఆగిపోయిన గడియారాన్ని చూసినట్లయితే.. అది జీవితంలో అడ్డంకులకు సంకేతం అవుతుంది. ఆగిపోయిన గడియారం శక్తి ప్రవాహాన్ని ఆపివేస్తుందని నమ్ముతారు. కాబట్టి.. ఆగిపోయిన గడియారాలను గదిలో ఉంచకూడదు.
చీపురు , చెత్తబుట్ట:
ఉదయాన్నే చీపురు లేదా చెత్తబుట్టను చూడటం వల్ల డబ్బు పరంగా సమస్యలు ఎదర్కోవలసి వస్తుంది. వాస్తు ప్రకారం.. ఇది పేదరికం ,ధన నష్టానికి కారణమవుతుంది. అందుకే ఉదయం లేవగానే చీపురు, చెత్తబుట్టలను చూడకూడదు.
మురికి పాత్రలు:
మురికి పాత్రలను ఎక్కడ పడితే అక్కడ ఉంచి.. ఉదయం నిద్రలేవగానే వాటిని చూడటం వల్ల ఇంట్లో నెగటీవ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతే కాకుండా ఇది శారీరక , మానసిక శక్తిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి.. రాత్రిపూట పాత్రలను శుభ్రం చేయడానికి ప్రయత్నించండి.
అద్దం:
చాలా మంది ఉదయం నిద్ర లేవగానే అద్దంలో తమను తాము చూసుకోవడం అలవాటు చేసుకుంటారు. వాస్తు శాస్త్రంలో.. ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మీ మానసిక, శారీరక సమతుల్యత దెబ్బతింటుంది.
మరిన్ని వాస్తు చిట్కాలు:
డబ్బు సమస్యలను నివారించడానికి జ్యోతిష్యశాస్త్రం, వాస్తు శాస్త్రంలో అనేక ముఖ్యమైన విషయాలు పేర్కొనడం జరిగింది . మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండకుండా.. జీవితంలో శ్రేయస్సు ఉండాలని మీరు కోరుకుంటే.. కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
సూర్యోదయానికి ముందే లేవండి:
వాస్తు శాస్త్రం ప్రకారం,.. సూర్యోదయానికి ముందు లేచి రోజు ప్రారంభించడం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది. సూర్యోదయం సమయంలో వాతావరణంలో తాజాదనం , సానుకూలత ఉంటాయి. ఇది మీ రోజును శుభప్రదంగా మారుస్తుంది. ఉదయాన్నే లేచి మీ పనిని ప్రారంభించడం వల్ల జీవితంలో పురోగతి ,శ్రేయస్సు అందుతాయి.
నీళ్లు తాగి దేవుడిని పూజించండి:
ఉదయం నిద్రలేచిన తర్వాత.. ముందుగా ఒక గ్లాసు నీరు తాగి, తరువాత దేవుడిని ధ్యానించండి. దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది . మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. అంతే కాకుండా రోజులోని సవాళ్లను ఎదుర్కోవడం సులభం చేస్తుంది.
Also Read: సూర్యుడు, చంద్రుడి సంచారం.. ఏప్రిల్ 28 నుండి వీరు పట్టిందల్లా బంగారం
ఇంటి ప్రధాన ద్వారం:
ఉదయం పూట ఇంటి ప్రధాన ద్వారం శుభ్రం చేయడం, దానిని సరిగ్గా తెరవడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం.. సానుకూల శక్తి ప్రధాన ద్వారం ద్వారా ప్రవేశిస్తుంది. కాబట్టి దానిని శుభ్రంగా ఉంచాలి. ఇదే కాకుండా.. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎటువంటి మురికి లేదా రుగ్మత ఉండకూడదు. ఇది ప్రతికూలతకు దారితీస్తుంది.