Actress Jyothi : టాలీవుడ్ కమెడియన్ జ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు.. ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది.. కేవలం కమెడియన్ గా మాత్రమే కాదు హీరోయిన్గా కూడా పలు సినిమాల్లో నటించింది. ఈ మధ్య ఈమె సినిమాల్లో కనిపించలేదు కానీ నిత్యం ఏదో ఒక వార్తతో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంది. తాజాగా ఆమె కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. ఆ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి…
సినీ నటి జ్యోతి ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటుంది.. అయితే ఈ మధ్య బుల్లితెర పై ప్రసారమవుతున్న పలు షోలలో సందడి చేస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న జ్యోతి ఆమె ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా ఆమె కొత్త ఇంటి ఫోటోలను అభిమానులతో పంచుకుంది. చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన జ్యోతి.. నూతన గృహప్రవేశం చేసినట్లు చెప్పుకొచ్చింది. కొడుకుతో కలిసి దిగిన ఫొటోలని షేర్ చేసింది.. ఆ ఫోటోలను చూసినా నెటిజన్లు ఈమెకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? అసలు జ్యోతి కి పెళ్లయిందా..? మరి ఆమె భర్త ఎవరు? ఆయన ఏం చేస్తుంటాడు.. లేదా బాబును దత్తత తీసుకుందా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: రేపు థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఫోకస్ ఆ మూవీపైనే..
తెలుగు సినీ నటి జ్యోతి వ్యాంప్ తరహా పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది..ఈమె సినిమాలు మాత్రమే కాదు. బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొన్నారు. టాస్కులలో పెద్దగా పెర్ఫార్మెన్స్ కనిపించక పోవడంతో రెండోవారమే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. సాధారణంగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు. కానీ ఈమె మాత్రం ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. అప్పుడప్పుడు టీవీ షోలలో కనిపిస్తూ వచ్చింది. ఇప్పటివరకు భూకైలాసం, ఎవడిగోలవాడిది, గుడుంబా శంకర్, మహత్మ, దరువు, రంగ ది దొంగ, కెవ్వు కేక తదితర సినిమాలు చేసింది.. చివరిగా గోల గోల అనే సినిమాలో నటించింది.. ఈమధ్య సినిమాలు సీరియల్స్ ఏమి చేయడం లేదు. అయితే ఈమధ్య ఈమె లాంటి తెలుగు యాక్టర్స్ చాలామంది ఖాళీగానే ఉన్నారు.. అందుకు కారణం డైరెక్టర్లు వీళ్ళకి సినిమా అవకాశాలు ఇవ్వకపోవడమే అని ఇటీవల గీతా సింగ్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదే నిజమా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయో తెలియలేదు. కానీ ప్రస్తుతం జ్యోతి మాత్రం సినిమాలకు దూరంగా ఉంది. ఇక ముందే ఏమైనా సినిమాలు చేస్తుందేమో చూడాలి..