Pratika Rawal : మహిళల వరల్డ్ కప్ ఫైనల్ లో భారత మహిళా క్రికెట్ జట్టు సౌతాఫ్రికాను ఓడించి తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన భారత మహిళల జట్టుకి ట్రోఫీని అందజేయడంతో పాటు ప్లేయర్లకు కూడా విజేత పతకాలను అందజేశారు. కానీ కీలక క్రీడాకారిణి, యువ బ్యాటర్ ప్రతీక రావల్ కి మాత్రం మెడల్ దక్కలేదు. ముఖ్యంగా ప్రపంచ కప్ గెలిచిన ఆనందం, మెడల్ దక్కలేదనే బాధ ఆమెలో స్పష్టంగా కనిపించాయి. గాయం కారణంగా ఆమెను 15 మెంబర్ స్క్వాడ్ నుంచి తప్పించడంతో ఆమెకు మెడల్ ఇవ్వలేదు. అయితే నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా ఆల్ రౌండర్ అమన్ జోత్ కౌర్ తన మెడలోని విన్నింగ్ మెడల్ ను రావల్ ఇచ్చారు.
Also Read : PM MODI: వరల్డ్ కప్ టైటిల్ టచ్ చేయకపోవడంపై ట్రోలింగ్..ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేశారంటే ?
ప్రతీక రావల్ వీల్ చైర్ లో వచ్చి ప్రధాని మోడీతో ఫొటో దిగడం విశేషం. అమన్ జోత్ కౌర్ మెడల్ లేకుండా ఫొటో దిగారు. దీంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా కి టైటిల్ ను అందించడంలో ప్రతీక రావల్ అంకిత భావం, ఆమె చేసిన పరుగులు ఎంతగానో తోడ్పడ్డాయని చెప్పవచ్చు. జట్టులో రెండో అత్యధిక రన్ స్కోరర్ గా నిలిచింది. అయినప్పటికీ ఐసీసీ నిబంధనల కారణంగా ఆమె పతకాన్ని అందుకోలేకపోయింది. ప్రపంచ కప్ టీమిండియా తరపున ఓపెనర్ ప్రతీక రావల్ రెండో అత్యధిక పరుగులు చేసింది. ప్రతీక ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో సహా మొత్తం 308 పరుగులు చేసి టీమిండియా ఫైనల్ కి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచ కప్ మ్యాచ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన గ్రూపు దశ మ్యాచ్ లో క్యాచ్ పడుతూ ఆమె కాలికి గాయం అయింది. దీంతో కాలు ప్రాక్చర్ అయినట్టు సమాచారం.
ప్రతీక రావల్ గాయానికి ముందు 6 ఇన్నింగ్స్ ల్లో 51.33 సగటుతో 308 పరుగులు చేసి భారత్ సెమీ ఫైనల్ కి చేరడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె గాయం కారణంగా జట్టు మేనేజ్ మెంట్ సమీ ఫైనల్ కి ముందు ఆమె స్థానంలో షెఫాలీ వర్మను ప్రత్యామ్నయంగా తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం.. తుది 15 మంది సభ్యుల జట్టులో ఉన్న ఆటగాళ్లకు మాత్రమే ప్రపంచకప్ మెడల్స్ అందజేస్తారు. ప్రతీక రావల్ సెమీ ఫైనల్ కి ముందే తుది 15 మంది సభ్యుల జట్టు నుంచి అధికారికంగా తొలగించి ఆమె స్థానంలో షెఫాలీ వర్మను చేర్చారు. ఆమె చేసిన పరుగులు జట్టు విజయంలో ఎంత ముఖ్యం అయినా.. నిబంధనల ప్రకారం.. ఆమె మెడల్ అందుకోలేకపోయింది. గతంలో 2003 పురుషుల ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా ఆటగాడు జాసన్ గిలెస్పీ కూడా నాలుగు మ్యాచ్ ల్లో 8 వికెట్లు తీసినప్పటికీ.. గాయం కారణంగా మధ్యలో తొలగించడంతో మెడల్ దక్కలేదు. ప్రస్తుతం ప్రతీక రావల్ పరిస్థితి కూడా అలాంటిదే. అయితే భారత ప్రధానితో భేటీ సందర్భంగా ఆల్ రౌండర్ అమన్ జోత్ కౌర్ ఆమె మెడల్ ని ప్రతీక రావల్ కి వేసి గొప్ప మనస్సు చాటుకుంది. ఆమెను అందరూ అభినందించడం విశేషం.
https://www.facebook.com/share/17W7Qj7sfH/