Hyderabad News: సిటీ కల్చర్ మారింది.. సహజీవనం పేరుతో యువతీ యువకులు తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఫలితంగా తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. హైదరాబాద్ సిటీలో సహజీవనం పేరుతో ఓ అపార్టుమెంటులో ఉంటున్నారు ఓ జంట. డ్రగ్స్.. ఓవర్ డోస్ తీసుకోవడంతో ఒకరు మృతి చెందారు. మరొకరు పరిస్థితి సీరియస్‌గా ఉంది. యువతిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
సహజీవనం.. డ్రగ్స్ తీసుకున్న జంట
అత్తాపూర్ శివారులోని శివరామ్‌పల్లిలో ఓ జంట సహజీవనం చేస్తున్నారు. పాతబస్తీకి చెందిన అహ్మద్ అలీ మొబైల్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అతడికి కర్నూల్ కి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మరింత దగ్గరయ్యారు. చివరకు సహజీవనానికి దారి తీసింది. శివరామ్ పల్లి ఏరియాలోని కెన్‌వర్త్ అపార్టుమెంటలో ఉంటున్నారు.
ఇంతవరకు బాగానే జరిగింది. ఈ జంటతోపాటు మరో ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో వారంతా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓవర్‌డోస్ కారణంగా అలీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అలీ సహజీవనం చేస్తున్న యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయితే యువతీ యువకులు పార్టీ చేసుకోవడం, ఆ తర్వాత ఆ ఫ్లాట్ నుంచి ఎలాంటి చప్పుడు రాలేదు.
ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి సీరియస్
అలీ నుంచి ఎలాంటి కదలిక లేకపోవడంతో మరో యువకుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి అహ్మద్ అలీ మృతి చెందాడు. మరో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. విచారణలో భాగంగా రాత్రి అహ్మద్ అలీతో మరో యువకుడు ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లు తేలింది.
ALSO READ: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం, నలుగురు చిక్కారు
అధికంగా డ్రగ్స్ తీసుకోవడం వల్లే అతడు మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతికి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. యువతిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులను చూసి మరో యువతి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ యువతిని వెంబడించి మరీ అరెస్టు చేశారు. ముగ్గురికీ పరీక్షలు చేయగా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.