Kaantha: ప్రముఖ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquar Salman) హీరోగా, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri borse) హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం కాంత. రానా, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. సినిమా అనే మోజులో పడి.. డబ్బు, పలుకుబడి పెరిగిన తర్వాత మనిషిలో వచ్చే మార్పులను.. అహంకారాన్ని హైలెట్గా చేస్తూ తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే “ఊదేయడానికి నేను దుమ్మును కాదు.. పర్వతాన్ని” అంటూ హీరో చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా కాంత అంటూ వచ్చిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ALSO READ:Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !
“ఒక కథ ఎప్పుడు చెప్పాలన్నది.. ఆ కథే నిర్ణయిస్తుంది” అంటూ సముద్రఖని చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ” ఒక న్యూస్ దాని తర్వాత వచ్చిన ఒక ఫోన్ కాల్.. ఎవ్రీథింగ్ చేంజ్”.. ఇక తర్వాత డబ్బు, పరపతి, ఖ్యాతి వచ్చిన తర్వాత.. హీరో ప్రవర్తించిన తీరు.. “ఈ సినిమా ఇచ్చే డబ్బు, పేరు, ఖ్యాతి ఇవన్నీ నిన్ను పాడు చేసేసాయి”.. వంటి డైలాగులు ఈ కథలోని డెప్త్ ను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా “ఈ అద్భుతమే” అనే పాట అందులోని మెలోడీ చాలా హాయిగా మనసులను తాకుతోంది. అని చెప్పవచ్చు. సినిమా నేపథ్యంలో సాగే కథ లాగా అనిపిస్తుంది. ఒక హీరోకి, దర్శకుడికి మధ్య చిన్న గొడవ వస్తుంది. ఆ గొడవ ఈ కథను ఎలాంటి మలుపులు తిప్పిందనేది ఈ కాంత మూవీ. ఇక ఇందులో హీరోగా దుల్కర్ సల్మాన్, దర్శకుడిగా సముద్రఖని నటించారు. అటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా రానా ఎంట్రీ అదిరిపోయింది. ఆయన గెటప్ కూడా ఆకట్టుకుంటుంది. ఒక రకంగా చూస్తుంటే ఈ సినిమాలో మహానటి సినిమా ఫ్లేవర్ కనిపిస్తోంది అని చెప్పవచ్చు. పైగా ఇదొక డబ్బింగ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు అనే ఫీలింగ్ చూసే ఆడియన్స్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే ట్రైలర్ తోనే అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.
సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇకపోతే ఈ సినిమాని రానా, దుల్కర్ సల్మాన్ కలసి నిర్మించడమే కాకుండా ఇందులో నటిస్తున్నారు కూడా.. వాస్తవానికి సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా.. కొన్ని కారణాలవల్ల ఇప్పుడు నవంబర్లో విడుదలకు సిద్ధమవుతోంది. అసలే రానా, దుల్కర్ సల్మాన్ సినిమాలు నిర్మిస్తున్నారు అంటే.. ఆ కథలో ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటిది ఇద్దరు కలిసి నిర్మించడమే కాకుండా నటిస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.