BigTV English
Advertisement

Chicken Sweet Corn Soup: రెస్టారెంట్ స్టైల్ చికెన్ స్వీట్ కార్న్ సూప్.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Chicken Sweet Corn Soup: రెస్టారెంట్ స్టైల్ చికెన్ స్వీట్ కార్న్ సూప్.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Chicken Sweet Corn Soup: చలికాలంలో వేడి వేడిగా ఏజైనా తాగాలనిపిస్తే.. టీ, కాఫీలకు బదులు ఆరోగ్యకరమైన, రుచికరమైన చికెన్ స్వీట్ కార్న్ సూప్ అద్భుతమైన ఎంపిక. రెస్టారెంట్‌లలో మనం ఇష్టంగా తాగే ఈ సూప్‌ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది జలుబు, దగ్గు వంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కూడా శక్తినిచ్చి, ఉపశమనం కలిగిస్తుంది. చికెన్ , స్వీట్ కార్న్ లతో తయారయ్యే ఈ సూప్, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది.


తయారీకి కావాల్సిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్ ముక్కలు- 100 గ్రాములు (చిన్న ముక్కలు)
స్వీట్ కార్న్ – 1 కప్పు
నీరు లేదా చికెన్ స్టాక్- 3-4 కప్పులు
క్యారెట్ తరుగు- 2 టేబుల్ స్పూన్లు
క్యాబేజీ తరుగు- (లేదా ఫ్రెంచ్ బీన్స్)2 టేబుల్ స్పూన్లు
కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూన్
ఎగ్ – 1
అల్లం, వెల్లుల్లి తరుగు- 1/2 టీస్పూన్
వెన్న- 1 టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
నల్ల మిరియాల పొడి- 1/2 – 1 టీస్పూన్
సోయా సాస్- 1/2 టీస్పూన్
పంచదార- చిటికెడు
తయారీ విధానం: ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేసి.. 3 కప్పుల నీటిలో కొద్దిగా ఉప్పు, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి మెత్తగా ఉడికించాలి. చికెన్ ఉడికిన తర్వాత.. ముక్కలను తీసి పక్కన పెట్టి, ఆ చికెన్ ఉడికించిన నీరు (చికెన్ స్టాక్)ను సూప్‌లో వాడుకోవడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. చికెన్ ముక్కలను వీలైతే చిన్నగా చిదుముకోవాలి. స్వీట్ కార్న్ సిద్ధం చేయడం:స్వీట్ కార్న్ గింజలలో సగం తీసి మిక్సీలో కచ్చా పచ్చాగా (మెత్తగా కాకుండా) గ్రైండ్ చేసుకోవాలి. మిగిలిన సగం గింజలను అలాగే ఉంచాలి.

సూప్ ఉడికించడం: ఒక మందపాటి గిన్నె లేదా పాన్‌లో కొద్దిగా నూనె/వెన్న వేసి వేడి చేయాలి. అందులో మిగిలిన అల్లం-వెల్లుల్లి తరుగు వేసి, సువాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత క్యారెట్, క్యాబేజీ తరుగు వేసి 1-2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు చికెన్ స్టాక్, గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్ పేస్ట్.. అలాగే ఉంచిన స్వీట్ కార్న్ గింజలు, చిదిమిన చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి.


Also Read: బరువు తగ్గాలనుకునే వారు.. ఎలాంటి ఫ్రూట్స్ తినాలి ?

మసాలాలు & చిక్కదనం: ఈ మిశ్రమాన్ని 5-7 నిమిషాలు బాగా ఉడికించాలి. ఉప్పు, నల్ల మిరియాల పొడి, పంచదార, సోయా సాస్ వేసి రుచి చూసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కార్న్ ఫ్లోర్ తీసుకుని, కొద్దిగా నీరు పోసి ఉండలు లేకుండా బాగా కలిపి, ఆ మిశ్రమాన్ని సూప్‌లో నెమ్మదిగా పోస్తూ, ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. సూప్ చిక్కబడే వరకు 2 నిమిషాలు ఉడికించాలి.

ఎగ్ కలపడం: చివరగా.. బాగా బీట్ చేసిన ఎగ్ సూప్ బాగా మరిగేటప్పుడు.. ఒకే చోట పోయకుండా.. గిన్నె చుట్టూ నెమ్మదిగా సన్నటి ధారలా పోస్తూ.. త్వరగా గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇది సూప్‌కి మరింత రుచిని, మంచి ఆకృతిని ఇస్తుంది.

సర్వింగ్: 1 నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆపివేసి.. వేడి వేడి చికెన్ స్వీట్ కార్న్ సూప్‌ని ఒక గిన్నెలో పోసి, పైన కొద్దిగా నల్ల మిరియాల పొడి లేదా స్ప్రింగ్ ఆనియన్స్ తో అలంకరించి సర్వ్ చేయండి. ఈ సులభమైన పద్ధతిలో తయారుచేసిన సూప్, రెస్టారెంట్ రుచిని కచ్చితంగా అందిస్తుంది.

Related News

Bitter Gourd Juice: ఉదయం పూట కాకరకాయ జ్యూస్ తాగితే.. ఈ రోగాలన్నీ పరార్ !

Dosakaya Pachadi: దోసకాయ కాల్చి ఇలా రోటి పచ్చడి చేశారంటే అదిరిపోతుంది

Most Dangerous Foods: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆహారాలు.. సరిగ్గా వండకపోతే ప్రాణాలకే ప్రమాదం !

Omelette Vs Boiled Egg: ఉడికించిన ఎగ్స్ Vs ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది బెటర్ ?

Saliva Test: ఏంటి నిజమా? లాలాజలంతో గుండె పనితీరు గుర్తించొచ్చా..! అదెలా ?

Tips For Hair: జుట్టు త్వరగా పెరగాలా ? అయితే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Banana: ఖాళీ కడుపుతో అరటిపండు తింటే.. జరిగేది ఇదే ?

Big Stories

×