BRS Rajatotsava Sabha: పాతికేళ్ల సందర్భంగా వరంగల్ వేదికగా రజతోత్సవ సభ చేపట్టింది బీఆర్ఎస్. పార్టీ ఏర్పడి 25 ఏళ్లు కావడంతో చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాటు చేశారు ఆ పార్టీ నేతలు. అనుకున్నట్లుగా ముఖ్య నేతలకు ఒక్కో విభాగం అప్పగించారు. ఏ మాత్రం తేడా రావడానికి వీల్లేదని హైకమాండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్లాయి. సభకు స్థలం సేకరణ మొదలు పూర్తి అయ్యేవరకు కొందరికి బాధ్యతలు అప్పగించారు.
పాతికేళ్ల ప్రస్థానంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ పదేళ్లు పాలించింది. పాలన ఏమోగానీ, కారు పార్టీ నేతలంతా కోట్లలో దోచారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ సహా విపక్ష బీజేపీ విమర్శలు గుప్పించాయి.. ఇంకా కంటిన్యూ అవుతోంది. ఎన్నికల సమయంలో ఇదంతా సహజమేనని అందరూ భావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ.. గత పాలనపై చేపట్టిన అనేక ప్రాజెక్టులపై జ్యూడీషియల్ విచారణ మొదలుపెట్టింది. దీనికి సంబంధించి నివేదికలు రేపో మాపో బయటకు రానున్నాయి.
గడిచిన ఏడాదిగా షెడ్‌కి పరిమితమైంది కారు. కేటీఆర్, హరీష్‌రావు, కవిత తప్పితే మీడియా ముందు వచ్చి మాట్లాడే నేతలు కరువయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే కారు షెడ్‌కి దాదాపుగా పరిమితమైంది. తెలంగాణ పచ్చగా ఉందంటే మా ప్రభుత్వం వల్లేనని కారు పార్టీ నేతలు ఒకటే రీసౌండ్. ఇప్పుడు ఆ విషయాలను బయటపెట్టింది అధికార పార్టీ. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.
బీఆర్ఎస్ నేతలు ఎప్పుడు మాట్లాడినా కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులు దేశానికి తలమానికమంటూ గొప్పలు చెప్పే ప్రయత్నం చేసేవారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చాలామందిని ఆకట్టుకుంటోంది. వాటర్ బాటిళ్లపై కేసీఆర్ ఫోటో, రజతోత్సవ సభ అంటూ ఉంది. సభకు హాజరుకావాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలని రాసుకొచ్చింది.
ALSO READ: అఘోరీ గుట్టు రట్టు.. వెనుకనుంచి నడిపిస్తోంది ఆ నేతే?
50 వేల కోట్లతో రూపొందించిన మిషన్ భగీరథ నీళ్లు ఇవేనా? అంతకంటే ఎక్కువ ఖర్చు ఏ కంపెనీవాడు పెట్టలేదు? అంత భారీ ఖర్చు చేసినా, మిషన్ భగీరథ లక్ష్యాన్ని ఎందుకు సాధించలేకపోయారు? పని రాని ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను లక్షల సంఖ్యలో తెచ్చి కాలుష్యాన్ని పెంచుతున్నదెవరు? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించింది.
ఇంత ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుని చివరికి ఏ నీళ్ల బాటిల్ పెట్టారు అని ప్రశ్నించండి. నిజంగా మిషన్ భగీరథ పని చేస్తుంటే ఆ నీళ్లు ఉండేవని రాసుకొచ్చింది. ఈ విషయంపై ఆ పార్టీని ప్రశ్నించండి? మీ సంపదను, మీ భవిష్యత్‌ను ఎవరు దోచుకున్నారు? అంటూ తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టింది. దీనిపై కారు నేతలు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కాకపోయినా సభ మరుసటి రోజైనా వీళ్లని ప్రజలు ప్రశ్నించడం ఖాయమనే వాదనల లేకపోలేదు.
సభకు హాజరుకావాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరూ…
ఒకసారి ఈ బాటిల్ వైపు చూడండి
50 వేల కోట్లతో రూపొందించిన మిషన్ భగీరథ నీళ్లు ఇవేనా అని మీరే ఆలోచించండి!
🔸అంత కంటే ఎక్కువ ఖర్చు ఏ కంపెనీ వాడు పెట్టలే
🔸అంత భారీ ఖర్చు చేసినా, మిషన్ భగీరథ లక్ష్యాన్ని సాధించలేకపోయారు.పని రాని… pic.twitter.com/9xyZqHu1TL
— Congress for Telangana (@Congress4TS) April 27, 2025