Bigg Boss 9 Promo:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ.. మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్.. తాజాగా 60వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా.. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ కారణంగా పాపం ఇమ్మానుయేల్ అడ్డంగా బుక్ అయిపోయారు అని చెప్పవచ్చు. మరి తాజా ప్రోమోలో ఏముంది? అసలు ఆ సీక్రెట్ టాస్క్ ఏంటి? ఇమ్మానుయేల్ కు వచ్చిన నష్టం ఏంటి ? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా బిగ్ బాస్ ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ సీక్రెట్ గా ఇస్తున్నట్లు తెలుస్తోంది. నిన్నటికి నిన్న తనూజాతో ఫోన్ మాట్లాడిన బిగ్ బాస్ .. కంటెండర్ షిప్ ఇకపై ఫోన్లోనే మాట్లాడతానని చెప్పి.. అందరికీ చెప్పమని చెప్పాడు. అయితే ఆమె మాటల్ని హౌస్ మేట్స్ ఎవరూ కూడా నమ్మలేదు. అలా తనుజాపై హౌస్ మేట్స్ మధ్య వ్యతిరేకతను కలిగించారు బిగ్ బాస్. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో రీతూ చౌదరికి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. చాలా సీరియస్గా ఎవరో ఒకరితో గొడవపడాలి అని చెప్పి ఆమెకు టాస్క్ గురించి వివరించారు.
ALSO READ:Tollywood Directors: ట్రెండింగ్ లో తెలుగు దర్శకులు.. ఈ దర్శకుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?
ఇకపోతే ఆ టాస్క్ లో భాగంగా ఎవరో ఒకరితో సీరియస్గా గొడవ పెట్టుకోవాలని చెప్పడంతో ఆమె ఇమ్మానుయేల్ తో గొడవ పెట్టుకుంది. పవన్ ని తీసేయకుండా ఉంటే గెలిచే వాళ్ళం అంటూ ఫైర్ అయ్యింది. ఎందుకు నన్ను ఒక్కడినే అంటున్నారు.. అందరూ ఓటు వేశారు కదా… అందులో నా తప్పేముంది అంటూ చెప్పగా.. నువ్వు కావాలనే చేశావు.. మొదట తీసేయను అని చెప్పి పవన్ ను ఎందుకు తీసేసావ్ అంటూ ఇమ్మానుయేల్ తో గొడవ పెట్టుకుంది. మధ్యలో రాము రాథోడ్ కూడా ఎంటరయ్యారు. ఇలా ఈ గొడవ కాసేపు సీరియస్ గానే సాగింది.
ఇకపోతే కంటెండర్ షిప్ టాస్క్ లో భాగంగా జట్ల మధ్య ఒక టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. బకెట్లో నీళ్లు తీసుకుని.. ఎదురుగా ఉన్న పార్టనర్ బకెట్లోకి విసరాలి. ఆ నీటిని పట్టుకున్న పార్ట్నర్ మరో ట్యాంకులోకి నీటిని ట్రాన్స్ఫర్ చేయాలి. అందులో ఉన్న బాల్స్ బయటకి వస్తే వాటిని తీసుకెళ్లి ఒక నెట్లో వేయాల్సి ఉంటుంది అంటూ టాస్క్ విధించారు. కంటెస్టెంట్స్ కూడా టాస్క్ లో గట్టిగానే పోటీ పడ్డారు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.