BigTV English

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆదాయాన్ని మించి ఖర్చులు!

Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆదాయాన్ని మించి ఖర్చులు!

Astrology Today: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఏ రాశి వారికి కలిసొచ్చే అవకాశం ఉంది అనే విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో మనోబలంతో పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి విషయాల్లో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఏర్పడవచ్చు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం.

వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు మానసికంగా దృఢంగా ఉంటారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ప్రారంభించిన పనుల్లో ఎదురైన సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉండవచ్చు.ఊహించని ఆదాయం సమకూరుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్ట దేవతానాధన శుభకరం.


మిథునం:
మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో గౌరవం పొందుతారు. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యలను బుద్ధిబలంతో పరిష్కరిస్తారు. తటస్థ నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అవసరానికి సహాయం అందుతుంది. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక ఇబ్బందులు పడతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆదిత్య హృదయం పారయణ చేస్తే మేలు జరుగుతుంది.

సింహం:
సింహ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగులు కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా పూర్తి చేయాలి.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులపై అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేసి పేరు, ప్రఖ్యాతలు సంపాదిస్తారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యాపారులకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు, విద్యార్థులు తమ రంగాల్లో రాణిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

తుల:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే మోసానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. పెద్దల సలహాలు పనిచేస్తాయి. ధనప్రవాహం ఉంటుంది. ఎవరినీ నమ్మకపోవడమే ఉత్తమం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రారంభించిన పనుల్లో ఇతరుల సహకారంతో త్వరగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో ఉంటారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం రాకపోవచ్చు. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనుల్లో అనుభవం ఉన్న పెద్దల సలహాలతో పూర్తిచేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ఇబ్బందులు పడతారు. లతితా సహస్రనామ పారాయణ చేయాలి.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అధిక లాభాలు పొందుతారు. ఆదాయం పదింతలు పెరుగుతుంది. దైవబలం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో హోదా పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

Also Read: 48 గంటల తర్వాత ఈ 3 రాశులకు అన్నీ మంచి రోజులే

కుంభం:
కుంభ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. గిట్టనివారితో ఆచితూచి మాట్లాడాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపారాల్లో పోటీ ఉంటుంది. కీలక వ్యవహారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు కలగకుండా చూసుకోవాలి. ప్రత్యర్థులతో తగాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. బంధుమిత్రుల సహకారం తీసుకుంటారు. వినాయకుడి ఆలయ సందర్శన శుభకరం.

Related News

Vastu For Staircase: ఇంటి లోపల.. మెట్లు ఏ దిశలో ఉండాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసం, ఏ రోజు నుంచి ప్రారంభం ? పూర్తి వివరాలివిగో..

Bed Room Vastu: పొరపాటున కూడా.. ఇలాంటి వస్తువులు బెడ్ రూంలో పెట్టొద్దు !

Bullet Baba temple: ఈ గుడిలో ప్రసాదంగా మద్యం.. మిస్టరీగా బుల్లెట్ బాబా రహస్య ఆలయం!

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Big Stories

×