OTT Movie : సమాజంలో మహిళలు ఎదుర్కునే సమస్యలతో, ఒక బాలీవుడ్ సినిమా బలమైన మెసేజ్ ఇస్తోంది. ఇది మహిళల ఫ్రీడమ్ గురించి ఎమోషనల్ గా సాగే స్టోరీ. ఈ కథ రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో నివసించే, నలుగురు మహిళల చుట్టూ తిరుగుతుంది. రాధికా అప్టే ప్రత్యేక పాత్రలో ఈ సినిమాకి హైప్ తెచ్చారు. అయితే బో*ల్డ్ కంటెంట్ కారణంగా, ఈ సినిమాని ఒంటరిగా చూడటమే మంచిది. ఈ సినిమా 2016 నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ హిందీ, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (రాధికా అప్టే) దక్కించు కుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘పార్చ్డ్’ (Parched) 2015లో వచ్చిన హిందీ డ్రామా సినిమా. లీనా యాదవ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో రాణి (తన్నిష్టా చటర్జీ), లజ్జో (రాధికా అప్టే), బిజ్లీ (సుర్వీన్ చౌలా), జానకి (సయాంని ధర్మాజన్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 26 నిమిషాల నిడివి ఉన్నఈ సినిమా, IMDbలో 7.5/10 రేటింగ్ పొందింది. ఇది 2016 సెప్టెంబర్ 23న భారతదేశంలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లో ఉంది.
ఈ కథ రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామంలో స్టార్ట్ అవుతుంది. రాణి అనే ఒక వితంతువు, తన కొడుకు గులాబ్‌కు జానకితో పెళ్లి చేయాలనుకుంటుంది. జానకిని చిన్న వయసులోనే గులాబ్ తో పెళ్లి జరిపిస్తారు. మరోవైపు రాణి బెస్ట్ ఫ్రెండ్ లజ్జోకి, పిల్లలు కలగనందుకు ఆమె భర్త తీవ్రంగా కొడుతుంటాడు. అదే గ్రామంలో బిజ్లీ అనే మహిళ ప్రొస్టిట్యూట్ చేసుకుంటూ, కొంచెం ఫ్రీడమ్‌తో జీవిస్తుంటుంది. గులాబ్ కూడా మద్యం తాగి జానకిని కొడుతుంటాడు. రాత్రయితే ఆ విషయంలో మరీ ఆరాచకంగా ప్రవర్తిస్తుంటాడు. ఈ నలుగురు మహిళలు ఫ్రెండ్స్, గ్రామంలో మగాళ్ల బాధల గురించి మాట్లాడుకుంటారు. వాళ్ల జీవితాలు మగాళ్ల ఆధిపత్యం వల్ల ఇబ్బందుల్లో ఉంటాయి.
రాణి, లజ్జో, బిజ్లీ, జానకి కలిసి తమ సమస్యల గురించి ఓపెన్‌గా మాట్లాడతారు. లజ్జో తన భర్తకి వ్యతిరేకంగా పోరాడుతుంది. బిజ్లీ తన జాబ్‌లో కొత్త అమ్మాయి వచ్చినందుకు జెలస్ అవుతుంది. కానీ ఆమె ఫ్రెండ్స్‌కు ఫ్రీడమ్ గురించి చెబుతుంది. రాణి తన కొడుకు గులాబ్‌ను సరిచేయడానికి ట్రై చేస్తుంది. కానీ అతను ఏమాత్రం మారడు. గులాబ్ కొట్టడం వల్ల జానకి చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ నలుగురూ ఒక రాత్రి గ్రామంలోని మగాళ్లు పెట్టే బాధల నుంచి తప్పించుకోవాలని డిసైడ్ అవుతారు. వాళ్లు గ్రామం వదిలి పారిపోవాలని ప్లాన్ చేస్తారు. ఇక వాళ్లు గ్రామం నుంచి పారిపోతారు. కానీ జానకి కోపంతో తిరిగి వచ్చి, తన భర్త గులాబ్‌ను చంపేస్తుంది. ఈ విషయంలో రాణి జానకిని సపోర్ట్ చేస్తుంది. వీళ్ళంతా ఇప్పుడు కొత్త జీవితం స్టార్ట్ చేసి, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.
Read Also : దెయ్యంతో పాస్టర్ దిక్కుమాలిన పని… చేతబడి చేస్తూ అమ్మాయితో ఘోరంగా… ఇంత కరువులో ఉన్నాడేంటి మావా ?