Bigg Boss 9 Harish Eliminated: మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. నాలుగో వారం ఎలిమినేషన్ లో భాగంగా హరీష్ హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. ఈ వారం ఒక్కొక్కరు సేఫ్ అవుతూ చివరిగా దివ్య, హరీష్ లో డేంజర్ లో జోన్ లోకి వచ్చారు. వారిద్దరిలో తక్కువ ఓట్స్ వచ్చిన హరీష్ నాలుగో వారం ఎలిమినేట్ అయ్యాడు. అగ్ని పరీక్షలో మాస్క్ తో వచ్చి.. హౌజ్ లో తన ఆట మాత్రమే కాదు.. అందరి మాస్క్ లు బయటపెడతానంటూ సవాలు చేశాడు. కానీ, నాలుగో వారమే అతడు బయటకు వచ్చేసాడు. హౌజ్ లో ఉన్నంత కాలం.. హౌజ్ మేట్స్ కి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. నేను మోనార్క్ ని అన్నట్టు హౌజ్ రెబల్ గేమ్ ఆడి చూపించాడు.
మాస్క్ లేకుండ ఆడి.. ఎదుటివాళ్ల నెగిటివిటీని ముఖం మీద చెబుతూ తరచూ గొడవలో నిలిచాడు. నాలుగు వారాల పాటు హౌజ్ అంత ఒకటి.. హరీష్ ఒక్కడు ఒకటి అన్నట్టుగా తన ఆడుతూ వచ్చాడు. మొదటి వీక్ లోనే అందరికి చుక్కలు చూపించాడు. ఏమన్నా అలిగి.. తినడం తగ్గించాడు. ఇక ఓ వారం అయితే నీళ్లు కూడా తాగనంటూ నిరహార దీక్ష దిగాడు. అలా హౌజ్ లో పెద్ద తలనొప్పిగా మారిన మాస్క్ మ్యాన్.. అందరి దృష్టిలో మొండోడిగా మిగిలిపోయాడు. మాస్క్ లేకుండ రియల్ గేమ్ ఆడిన అతడు ఈ సీజన్ లో చివరి వరకు ఉంటాడని అతడి ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. కానీ, ఊహించని విధంగా నాలుగో వారమే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు.
హౌజ్ వీడుతూ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన హరీష్.. హౌజ్ కంటెస్టెంట్స్ మాస్క్ తొలగించాడు. ఇప్పటి వరకు హౌజ్ లో మాస్క్ తో ఆడుతుంది ఎవరూ, మాస్క్ లేకుండ ఆడుతుందో ఎవరో చెప్పాలని నాగార్జున చెప్పాడు. అక్కడ అమర్చిన బ్లాక అండ్ వైట్ మాస్క్ లో.. హౌజ్ లో మాస్క్ పెట్టుకుని ఆడుతున్నది ఎవరూ.. మాస్క్ లేకుండ ఆడుతుంది ఎవరో చెప్పాలని నాగ్ చెప్పాడు. దీంతో భరణి, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్ లు మాస్క్ తోనే ఉన్నారని స్టేట్ మెంట్ ఇచ్చాడు.
భరణి నిజం స్వరూపం ఏంటో నేను చూశాను. గుడ్ బుక్స్ లో ఉండి అందరిని ఇన్ఫ్లూయేన్స్ చేస్తున్నా అనుకుంటున్నాడు. కానీ, ఆయన హౌజ్ మేట్స్ మానిప్లేట్ చేస్తున్నాడు. ఆయన ఇంకా మాస్క్ తోనే ఉన్నారు. మంచి వాడు అనిపించుకోవడానికి నచ్చని వాళ్లతో కూడా కూల్ గా మాట్లాడుతున్నాడు. కానీ, ఆయన అసలు నిజస్వరూపం ఏంటో నేను చూశాను. కూల్ గా వచ్చి మాట్లాడటానికి కౌగిలించుకోవాలని చూస్తాడు. అది గమనించి మొదటి నుంచి ఆయనకు దూరంగా ఉంటూ వస్తున్నా.. మీరు అన్నట్టుగా భరణి రేలంగి మావయ్య అని అన్నాడు.
ఇమ్మాన్యుయేల్ సెన్సాఫ్ హ్యుమర్, కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయన ట్రూ కలర్ నా మాత్రమే చూపించాడు. మొదట్లో మాకు గొడవ అయినప్పుడు.. ఆయన ట్రూ సైడ్ చూశాను. కానీ అది కేవలం నాతో చూపించాడు. అందరి దగ్గర అది చూపించడం లేదు. అన్నగారి కుటుంబ అన్నట్టు అందరితో కలిసిపోదాం అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. కానీ, ఇప్పటి వరకు తన అసలు రూపం బయటపెట్టడం లేదు అని వివరించాడు. ఆ తర్వాత డిమోన్ ది ఇంతవరకు ఫుల్ పొటేన్షియల్ చూపించలేదు. అగ్ని పరీక్షలో అతడి పొటేన్షియల్ ఏంటో చూశాను.. కానీ, హౌజ్ ఇంకా అది బయటపెట్డం లేదు. ఇకనుంచి తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి..ఆడాలని కోరుకుంటున్నా అన్నాడు.
Also Read: Bigg Boss 9: సేఫ్ గేమర్స్ కి నాగార్జున షాక్.. ఎట్టకేలకు వారి బండారం బట్టబయలు..
అసలు మాస్క్ లేకుండ ఆడుతున్న వారు శ్రీజ, కళ్యాణ్, తనూజ పేర్లు చెప్పాడు. అగ్ని పరీక్షలో ఎలా ఉందో హౌజ్ లో అలాగే ఉంటుంది. బెసిగ్గా తన తీరే అంత. తన తొందర ఎక్కువ.. ఆ తొందరలో ఏవేవో మాట్లాడుతుంది.. కానీ, కొన్నిసార్లు తను పెట్టే పాయింట్స్ చాలా వాలిడ్ గా ఉంటాయని ప్రశంసించాడు. ఆ తర్వాత కళ్యాణ్ కూడా మాస్క్ లేకుండ ఆడుతున్నాడు. తనలాగే తను ఉంటున్నాడు. అదే గేమ్ ఆడు.. ఇంకా ఆటని మెరుగుపరుచుకో అంటూ సూచన ఇచ్చాడు.
తనూజలో నన్ను నేను చూసుకుంటాను. తన ఫేస్, నా ఫేస్ ఒకేలా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మా ఫేస్ లు చాలా సీరియస్ ఉన్నట్టు ఉంటాయి. కానీ, మనసులో ఏం ఉండదు. ముక్కు మీద కోపం తొందరగా చూపిస్తాం. చికాకు, కోపం అన్ని తొందరగా వస్తాయి. తనేంటో తను చూపిస్తుంది. మాస్క్ లేకుండ ఆడుతుంది. కానీ, కొన్ని విషయాల్లో జాగ్రత్త ఉండాలి. రిలేషన్ షిప్ స్ట్రక్ అయితే ఆగిపోతాం అది జరగకుండ చూసుకోండి అని సలహా ఇచ్చాడు.