OTT Movie : ఓటీటీలో ఎన్నోరకాల సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. నచ్చిన సినిమాను, దొరికిన సమయంలో చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు ప్రేక్షకులు. వీటిలో రొమాంటిక్ స్టోరీలను చూడటానికి ఆసక్తిని చూపిస్తున్నారు. కామెడీ జానర్ లో వచ్చిన ఒక రొమాంటిక్ సినిమా ఆడియన్స్ ని బాగా అలరించింది. ఒక సెన్సిటివ్ టాపిక్‌ను ఫన్నీగా, మెచ్యూర్‌గా హ్యాండిల్ చేసి, ఈ సినిమాకి హ్యాపీ ఎండింగ్ ని ఇచ్చారు మేకర్స్. కథలో హీరోకి సంసారానికి పనికిరాని జబ్బు ఉంటుంది. దీంతో కథ కామెడీ టర్న్ తీసుకుంటుంది. అయితే చివరికి అంతా శుభమే జరుగుతుంది. ఈ సినిమా పేరు ఏంటి ? ఎక్కడ ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘శుభ మంగళ్ సావ్ధాన్’ (Shubh Mangal Saavdhan) ఒక హిందీ రొమాంటిక్ కామెడీ సినిమా. ఆర్.ఎస్. ప్రసన్న దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో అయుష్మాన్ ఖురానా (ముదిత్), భూమి పెడ్నేకర్ (సుగంధ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2017 సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదలైంది. 2 గంటల నిడివితో, IMDbలో 6.9/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లో ఉంది
ముదిత్ అనే ఒక సాధారణ యువకుడు, లైఫ్‌లో సెటిల్ కావాలని అనుకుంటాడు. ఇంతలో అతను సుగంధ ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. వాళ్లు పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ పెళ్లి తర్వాత ముదిత్‌కు, ఒక పర్సనల్ సమస్య ఉందని తెలుస్తుంది. అతనికి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంటుంది. అంటే ఫిజికల్ ప్రాబ్లమ్ వల్ల ఇంటిమేట్ మూమెంట్స్‌లో ఇబ్బంది అవుతుంది. ముదిత్ ఈ సమస్యను, సుగంధకు చెప్పకుండా దాచి పెడతాడు. కానీ ఎట్టకేలకు సమస్య బయటపడుతుంది. విషయం తెలిసి సుగంధ షాక్ అవుతుంది. ఇప్పుడు వాళ్ల మధ్య టెన్షన్ మొదలవుతుంది.
ముదిత్ డాక్టర్ సలహాతో మెడిసిన్ ట్రై చేస్తాడు. ఈ సమస్య ఫ్యామిలీలకు కూడా తెలుస్తుంది. ముదిత్ తల్లి, తండ్రి కూడా షాక్ అవుతారు. కానీ వాళ్లు కూడా సపోర్ట్ చేస్తారు. సుగంధ తల్లి, తండ్రి కూడా విషయం తెలుసుకుని, వాళ్లు విడాకులు తీసుకోవాలని ప్రెషర్ చేస్తారు. కానీ సుగంధ ముదిత్‌ను లవ్ చేస్తుండటంతో, సమస్యను ఫేస్ చేయాలని అనుకుంటుంది. ముదిత్ డాక్టర్ సహాయంతో యోగా, మెడిటేషన్ ట్రై చేస్తాడు. సినిమా ఈ సమస్యను డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఫన్నీగా చూపిస్తుంది. ఇక ఫ్యామిలీల మధ్య గొడవలు, మిస్ అండర్ స్టాండింగ్స్ వస్తాయి. చివరికి ముదిత్ ఈ సమస్యను ఓవర్‌కమ్ చేస్తాడా ? వీళ్ళ రొమాంటిక్ లైఫ్ సవ్యంగా సాగుతుందా ? అనే విషయాలను , ఈ రొమాంటిక్ కామెడీ సినిమాని చూసి తెలుసుకోండి.
Read Also : భూమిపై 99 పర్సెంట్ మగాళ్లను తుడిచిపెట్టేసే భయంకరమైన వ్యాధి… మిగిలిన అబ్బాయిలను ఒకే రూమ్ లో బంధించి ఆ పని