Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్ 6వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రయాణాలలో మార్గ అవరోదాలు కలుగుతాయి. బంధు మిత్రుల వలన కొన్ని ఊహించని సమస్యలు కలుగుతాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహనిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.
వృత్తి వ్యాపార పరంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రాంత బంధు మిత్రుల నుండి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.
ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలలో ఆటంకాలు కలుగుతాయి. చేపట్టిన పనులల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు.
సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో ఒడిదుడుకులు తప్పవు. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
నిరుద్యోగులకు అరుదైన అవకాశములు లభిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామి నుండి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.
చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. శత్రు సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి.
వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు. పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఇతరుల విషయాలలో తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు.
ఇంట్లో కొన్ని పరిస్థితులు చికాకు పరుస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. బంధు మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.
సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించి లాభాలను అందుకుంటారు.
నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.
వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కొన్ని కీలక విషయాల గురించి చర్చిస్తారు. ధనదాయం పెరుగుతుంది.