Upcoming Movies Theater : ప్రతి నెల థియేటర్లోకి కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. సెప్టెంబర్ నెలలో వచ్చిన సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ ని షేక్ చేయలేకపోయాయి.. చివరగా వచ్చిన ఓజీ సినిమా ప్రేక్షకులను కాస్త ఆకట్టుకుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో నటించిన హరిహర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా పరాజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై అంజనలు రెట్టింపు అయ్యాయి. దాంతో అనుకున్నట్లుగానే సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. సెప్టెంబర్ నెల ముగిసిపోయింది. అక్టోబర్ నెల సినిమాల సందడి కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ నెలలో మొదటగా రిలీజ్ అయిన కాంతారా 1 సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా తర్వాత ఈ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేసుకుందాం పదండి..
ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి., ఏజీ ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌లపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించాడు. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, మహేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదొక ప్రేమ కథగా రాబోతున్న సినిమా.. అక్టోబర్ 10న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
కిరణ్ అబ్బవరం హీరోగా జైన్స్ నాని దర్శకత్వంలో వస్తున్న ఒక తెలుగు సినిమా, ఇది 2025 అక్టోబర్ 18న విడుదల కానుంది. ఇది లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్, కిరణ్ అబ్బవరం నటిస్తున్న 11వ చిత్రం..
డ్యూడ్ అనేది రాబోయే తమిళ-భాషా రొమాంటిక్ యాక్షన్ కామెడీ చిత్రం, ఇది కీర్తిశ్వరన్ రచన, దర్శకత్వం వహించబడింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, మిత బైజు ప్రధాన పాత్రలలో నటించారు, వీరితో పాటు ఆర్. శరత్ కుమార్, హృధు హరూన్ మరియు రోహిణి.. అక్టోబర్ 17న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.
టి. జి. విశ్వ ప్రసాద్ వివేక్ కుచిభోట్ల నిర్మతగా వ్యవహారిస్తున్నారు. ఇది తెలుగు-భాషా శృంగార నాటక చిత్రం, ఈ సినిమాకి నీరజ కోన దర్శకత్వం వహించింది. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా 2025 అక్టోబర్ 17న దీపావళి కానుకగా విడుదల కానుంది.
Also Read : ఈ వారం టీవీ సీరియల్స్ రేటింగ్.. టాప్ లోకి కొత్త సీరియల్..?
వీటితో పాటుగా ‘మిత్రమండలి’ చిత్రాలు ఈ పండక్కి రాబోతున్నాయి. నాలుగూ మీడియం రేంజ్ సినిమాలే. నాలుగింట్లోనూ ప్రేక్షకుల్ని ధియేటర్లకు రప్పించే అంశాలు ఉన్నాయి. అదేవిధంగా అక్టోబర్ నెల బాహుబలి రెండు పార్టీలను కలిపి ఒక సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి ఈనెల సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. మరి ఏ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..