BigTV English

Parani Mehndi:కాళ్లకు పసుపు రాసేటపుడు ఈ తప్పులు చేస్తున్నారా..

Parani Mehndi:కాళ్లకు పసుపు రాసేటపుడు ఈ తప్పులు చేస్తున్నారా..

Parani Mehndi:కాళ్ల‌కు ప‌సుపు రాసుకోవ‌డం అనేది ఎంతో కాలంగా మ‌నం ఆచ‌రిస్తున్న సంప్ర‌దాయాల్లో ఒక‌టి. స్త్రీలు సౌభాగ్యానికి చిహ్నంగా కూడా దీనిని భావిస్తారు. ప‌సుపు రాసిన పాదాలు చూడ‌చ‌క్క‌గా ఉంటాయి. పాదాల‌కు ప‌సుపు రాసుకోవ‌డం వెనుక శాస్త్రీయ‌త కూడా దాగి ఉంది. కాళ్ల‌కు ప‌సుపు రాసుకోవ‌డం మ‌న సంప్ర‌దాయం అయిన‌ప్ప‌టికి ప‌సుపు రాసుకోవ‌డంలో మ‌నం చేసే చిన్న చిన్న త‌ప్పుల వ‌ల్ల మ‌నం ల‌క్ష్మీ దేవికి దూరం అవుతామని పండితులు చెబుతున్నారు.ప‌సుపు రాసుకునేట‌ప్పుడు పాదాలు నేల‌కు తాక‌కుండా చూసుకోవాలి. నేల మీద ఏదైనా వ‌స్త్రాన్ని వేసి దాని మీద పాదాల‌ను ఉంచి ప‌సుపు రాసుకోవాలి. అలాగే పాదం అంత‌టా కూడా ప‌సుపును ఒకేవిధంగా రాసుకోవాలి.


ప‌సుపు రాసుకోవ‌డానికి కొంద‌రు చేతుల్లో ప‌సుపు తీసుకుని నీటిని పోసి చేతుల్లోనే ప‌సుపు క‌లిపి కాళ్ల‌కు రాసుకుంటారు. చేతుల్లో ప‌సుపు క‌ల‌ప‌డం అనేది అంత మంచి ప‌ద్ద‌తి కాదు. ల‌క్ష్మీ ప్ర‌దం కూడా కాదు. ప‌సుపును తీసుకుని ఒక గిన్నెలో నీటిని పోసి చ‌క్క‌గా క‌ల‌పాలి. త‌రువాత మూడు వేళ్ల‌తో ప‌సుపును తీసుకుని కాళ్ల‌కు రాసుకోవాలి.

నీటిలో స‌రిగ్గా ప‌సుపును క‌ల‌ప‌కుండా కాళ్ల‌కు రాసుకోవ‌డం ఐశ్వ‌ర్యం క‌లిసి రాదు. కాళ్ల‌కు ప‌సుపు రాసుకునేట‌ప్పుడు కూడా జాగ్రత్త‌గా రాసుకోవాలి. కాళ్ల‌నుకింద పెట్టి ఎప్పుడూ ప‌సుపు రాసుకోకూడ‌దు. ప‌సుపు రాసుకునేట‌ప్పుడు పాదాలు నేల‌కు తాక‌కుండా చూసుకోవాలి. నేల మీద ఏదైనా వ‌స్త్రాన్ని వేసి దాని మీద పాదాల‌ను ఉంచి ప‌సుపు రాసుకోవాలి.


అలాగే పాదం అంత‌టా కూడా ప‌సుపును ఒకేవిధంగా రాసుకోవాలి. ఒక ద‌గ్గ‌ర ఎక్కువ‌గా ఒక ద‌గ్గ‌ర త‌క్కువ‌గా ప‌సుపును రాసుకోకూడ‌దు. మ‌న‌మే కాదు ఎదుటి వారికి ప‌సుపు రాసేట‌ప్పుడు కూడా ఈ విధంగానే రాయాలి. అదేవిధంగా పాదాల‌కు ప‌సుపు రాసుకునేట‌ప్పుడు చీల‌మండ‌లు దాటి ప‌సుపు రాసుకోకూడ‌దు. పాదం వెనుక కూడా ప‌సుపు చ‌క్క‌గా అంటేలా రాసుకోవాలి.

Related News

Bed Room Vastu: పొరపాటున కూడా.. ఇలాంటి వస్తువులు బెడ్ రూంలో పెట్టొద్దు !

Bullet Baba temple: ఈ గుడిలో ప్రసాదంగా మద్యం.. మిస్టరీగా బుల్లెట్ బాబా రహస్య ఆలయం!

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Big Stories

×