Ramgopal Varma : ప్రముఖ కన్నడ సినీ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి(Rishabh Shetty) తాజాగా కాంతారా చాప్టర్ 1(Kantara Chapter1) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 2 వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ఈ సినిమాకు అన్ని ప్రాంతాలలో పాజిటివ్ టాక్ రావడమే కాకుండా భారీ స్థాయిలో సినిమా కలెక్షన్లను కూడా రాబడుతోంది. ఇలా ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో సినిమాపై ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇప్పటికే కాంతార సినిమా పట్ల, రిషబ్ నటన పట్ల ఎన్టీఆర్, ప్రభాస్ వంటి తదితరులు ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. తాజాగా ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సైతం కాంతార 1 సినిమాపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ మాత్రం తీవ్రదుమారం రేపుతుంది. ఈ సందర్భంగా కాంతార 1సినిమా గురించి వర్మ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..
“కాంతార సినిమా ఒక అద్భుతమైన సినిమా. భారతదేశంలో ఉన్న అన్ని చిత్ర నిర్మాతలు రిషబ్ శెట్టి అలాగే అతని బృందం.. సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ అలాగే బిఎఫ్ ఎక్స్ లలో చేసిన కృషిని చూసి సిగ్గుపడాలి. బోనస్ అయిన కంటెంట్ ను మరిచిపోయి వారి కృషి మాత్రమే ఈ సినిమాను బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలబెట్టింది. క్రియేటివ్ టీంకు రాజీ పడకుండా పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చిన హోం భలే ఫిలిమ్స్ కి అభినందనలు. రిషబ్ శెట్టి మీరు గొప్ప డైరెక్టరా లేకపోతే నటుడా అనే విషయాన్ని నేను నిర్ణయించుకోలేకపోతున్నాను అంటూ” ఈయన నమస్కరిస్తున్న ఎమోజిని షేర్ చేశారు. ఇలా కాంతార1 సినిమా గురించి దర్శకత్వ ప్రతిభ గురించి వర్మ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
KANTAAAARRRAAA is FANTAAAASTICCCC .. All FILM MAKERS in INDIA should feel ASHAMED after seeing the UNIMAGINABLE EFFORT @Shetty_Rishab and his team put in the BGM, SOUND DESIGN, CINEMATOGRAPHY , PRODUCTION DESIGN and VFX ..Forgetting the CONTENT which is a BONUS , their EFFORT…
— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2025
ఒక రకంగా చెప్పాలంటే ఈయన రిషబ్ శెట్టి పై ప్రశంసలు కురిపిస్తూ ఇతర దర్శక నిర్మాతలను విమర్శించారనే చెప్పాలి. ఇక వర్మ ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలపై నేటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కాంతార సినిమాకు ప్రీక్వెల్ చిత్రంగా కాంతార చాప్టర్ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కాంతార యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని రిషబ్ శెట్టి ఇదివరకు పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. ఇలా కాంతార సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయనకు ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో ఈయన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమాకు సీక్వెల్ చిత్రంగా రాబోతున్న జై హనుమాన్ సినిమాలో హనుమాన్ పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి అంచనాలను పెంచేసింది.
Also Read: Rashmika -Vijay Devarakonda: కలిసి దసరా జరుపుకున్న విజయ్ రష్మిక.. రిలేషన్ పై క్లారిటీ ఇవ్వచ్చుగా?