BigTV English

Mega158 : బాబీ, చిరంజీవి సినిమా కథ గురించి క్లారిటీ ఇచ్చిన తమన్

Mega158 : బాబీ, చిరంజీవి సినిమా కథ గురించి క్లారిటీ ఇచ్చిన తమన్

Mega158 : మెగాస్టార్ చిరంజీవి కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు పాలిటిక్స్ లోకి ఎంటర్ ఇచ్చారు. పాలిటిక్స్ లో కూడా ఎక్కువ శాతం మంది మెగాస్టార్ చిరంజీవికి బ్రహ్మరథం పట్టారు. అలానే మెగాస్టార్ సినిమాలకు దూరం అయిపోవడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో తలుక్కుమని మెరిసారు మెగాస్టార్. ఆ సినిమా చూసిన తర్వాత చాలామందికి ఒక హై వచ్చింది.


 

మొత్తానికి 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాక ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఇండస్ట్రీకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అయితే ఇది రీమేక్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ పూర్తిస్థాయిలో సంతృప్తి పడలేదు. మెగాస్టార్ రీయంట్రీ తర్వాత మెగా ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేసిన సినిమా వాల్తేరు వీరయ్య. ఇప్పుడు మళ్లీ బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేస్తున్నారు. సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చాడు తమన్.


కథ గురించి క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో చేస్తున్న 158వ సినిమాకి, తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా కథ గురించి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. ఈ సినిమా గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఉంటుంది అని ప్రముఖ జర్నలిస్టు అడగ్గానే అలా కాదు అది వేరే రేంజ్ స్టోరీ. మెగాస్టార్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో బాబీ మరోసారి అలా చూపించబోతున్నాడు అని క్లారిటీ ఇచ్చాడు.

పోస్టర్లో వైలెన్స్ కనిపిస్తుంది కాబట్టి గ్యాంగ్స్టర్ స్టోరీ అని అనుకుంటున్నారు. దానితో పెద్దగా సంబంధం ఉండదు అని తమన్ చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజ దసరా సందర్భంగా అక్టోబర్ 2న జరుగుతుంది అని అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వలన ఆ పూజ క్యాన్సిల్ అయిపోయింది. ఒక బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చేయబోయే సినిమా గురించి మంచి అంచనాలయితే ఉన్నాయి.

తమన్ విధ్వంసం 

రీసెంట్ టైమ్స్ లో తమన్ (Thaman S) కంటే ఎక్కువ తన మ్యూజిక్ మాట్లాడుతుంది. చాలా తమిళ సినిమాలను అనిరుద్ రవిచంద్రన్ ఎలా ఎలివేట్ చేస్తారో, అదే స్థాయిలో తమన్ కూడా తెలుగు సినిమాలను ఎలివేట్ చేస్తున్నాడు. అందుకే కొంతమంది బాలకృష్ణ అభిమానులు నందమూరి తమన్ అంటారు. మరి కొంతమంది మెగా అభిమానులు కొణిదెల తమన్ అంటారు. ఇక రీసెంట్గా ఓ జి సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెన్. మామూలు సీన్స్ ను కూడా తన మ్యూజిక్ తో హైలెట్ చేశాడు.

Also Read: RGV vs RRR : ఆ మాటలతో మళ్లీ సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ

Related News

Sreeleela: ఆ సినిమా నుంచి జాన్వీ కపూర్ అవుట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీ లీల!

The Raja Saab: పక్కా ప్లానింగ్ తో ప్రభాస్ మూవీ, మారుతి ది మామూలు స్పీడ్ కాదు

Ramgopal Varma: రిషబ్ శెట్టిను చూసి సిగ్గు తెచ్చుకోండి.. వర్మ సంచలన పోస్ట్!

Rashmika -Vijay Devarakonda: కలిసి దసరా జరుపుకున్న విజయ్ రష్మిక.. రిలేషన్ పై క్లారిటీ ఇవ్వచ్చుగా?

Ramcharan -Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్..మెగా వారసుడు రాబోతున్నాడా?

Akshay Kumar: నా కూతురిని అలాంటి ఫొటోలు పంపమని అడిగాడు.. పోలీసులను ఆశ్రయించిన అక్షయ్ కుమార్

Alai Balai-2025: మనసు ఉప్పొంగుతోంది.. ఇదే మొదటిసారి అంటున్న నాగ్!

Big Stories

×